ICC: కేన్ మామ.. మజాకానా.! 107 రోజులుగా ఒక్క టెస్ట్ ఆడలేదు.. మళ్లీ నెంబర్‌వన్‌గా అవతరించాడు..
ప్రస్తుతం మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. ప్రపంచ నెంబర్‌వన్ టెస్ట్ బ్యాటర్‌గా నిలిచాడు. అవును.! మీరు వింటున్నది నిజమే..

ప్రస్తుతం మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. ప్రపంచ నెంబర్‌వన్ టెస్ట్ బ్యాటర్‌గా నిలిచాడు. అవును.! మీరు వింటున్నది నిజమే.. 107 రోజులుగా ఒక్క టెస్ట్ ఆడలేదు.. కానీ తాజాగా రిలీజైన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కేన్ మామ నెంబర్‌వన్ టెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. యాషెస్ సిరీస్‌లోని తొలి టెస్టులో అద్భుతమైన సెంచరీతో అలరించిన జో రూట్‌ను వెనక్కి నెట్టి.. విలియమ్సన్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. కానీ రెండో టెస్టులో రూట్ పేలవ ప్రదర్శన కనబరచడంతో.. రూట్ నాలుగు స్థానాలు దిగజారి ఐదో ర్యాంక్‌తో సరిపెట్టుకున్నాడు.
గడిచిన 107 రోజులుగా ఏ టెస్టు మ్యాచ్ ఆడని విలియమ్సన్ నెంబర్‌వన్‌గా నిలవడం క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యాన్ని కలిగించింది. కేన్ మామ చివరిసారిగా శ్రీలంకతో మార్చి 17, 2023న వెల్లింగ్టన్ టెస్టు ఆడాడు. ఇక ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడిన విలియమ్సన్ తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు విలియమ్సన్. ప్రస్తుతం ఆ గాయం నుంచి కోలుకునే దశలో ఉన్నాడు.
స్టీవ్ స్మిత్ మళ్లీ అగ్రస్థానానికి రావచ్చు..!
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 4 స్థానాలు ఎగబాకి మళ్లీ రెండో స్థానానికి చేరుకున్నాడు స్టీవ్ స్మిత్. ప్రస్తుతం అతడు 882 రేటింగ్ పాయింట్లతో విలియమ్సన్ కంటే ఒక పాయింట్ వెనుకబడి ఉన్నాడు. హెడింగ్లీ టెస్ట్‌లో స్మిత్ అద్భుతంగా రాణిస్తే, అతడు మళ్లీ నెంబర్ వన్‌గా అవతరించవచ్చు.




