NED vs UAE: థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ఓడిన యూఏఈ.. చివరి ఓవర్‌లో విజయం సాధించిన నెదర్లాండ్స్..

T20 WC 2022: టీ20 ప్రపంచకప్‌లో రెండో క్వాలిఫయర్స్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 3 వికెట్ల తేడాతో UAEని ఓడించింది. వీరిద్దరి మధ్య ఈ మ్యాచ్ చివరి ఓవర్ వరకు సాగింది.

NED vs UAE: థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ఓడిన యూఏఈ.. చివరి ఓవర్‌లో విజయం సాధించిన నెదర్లాండ్స్..
Ned Vs Uae

Updated on: Oct 16, 2022 | 6:35 PM

2022 టీ20 ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ రౌండ్ రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ మూడు వికెట్ల తేడాతో యూఏఈని ఓడించింది. చివరి ఓవర్‌ వరకు సాగిన ఈ మ్యాచ్‌లో విజయం ఇరుజట్ల మధ్య దోబూచులాడింది. యూఏఈ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 111 పరుగులకే ఆలౌటైంది. అయితే ఈ చిన్న లక్ష్యాన్ని సాధించడంలో నెదర్లాండ్స్ చెమటోడ్చింది. ఒక దశలో యూఏఈ 111 పరుగులను డిఫెండ్ చేస్తుందని అనిపించినా, ఏడో వికెట్‌కు కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్, టిమ్ ప్రింగిల్ 27 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో మ్యాచ్‌ను తిరిగి నెదర్లాండ్స్‌కు చేర్చారు.

చివరి ఓవర్‌లో ఉత్కంఠ..

నెదర్లాండ్స్ టీ20 ప్రపంచకప్‌లో జీలాంగ్‌లోని సిమ్మండ్స్ స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్‌లో యూఏఈపై నెదర్లాండ్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వీరిద్దరి మధ్య జరిగిన ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగడంతో చివరి ఓవర్లో విజయం తేలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ జట్టు 20 ఓవర్లలో 111 పరుగులు చేయగలిగింది. యూఏఈ తరపున మహ్మద్ వసీమ్ 41 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అతను తప్ప బ్యాట్స్‌మెన్ ఎవరూ సత్తా చాటలేకపోయారు. నెదర్లాండ్స్ తరపున బాస్ డి లీ 3 వికెట్లు తీశాడు.

ఇవి కూడా చదవండి

112 పరుగుల ఛేదనలో నెదర్లాండ్స్ కూడా ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ లక్ష్యాన్ని నెదర్లాండ్స్ చివరి ఓవర్‌లో ఛేదించి 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నెదర్లాండ్స్ తరపున మాక్సోడ్ 23 పరుగులు చేయగా, చివర్లో కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్ 16 పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌లో టిమ్ పింగ్లేతో కలిసి 27 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను నెదర్లాండ్స్ వైపు తీసుకెళ్లాడు. మరోవైపు యూఏఈ తరపున జునైద్ సిద్ధిఖీ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ 3 వికెట్లు పడగొట్టాడు.