మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నేపాలీ యంగ్ క్రికెటర్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో సందీప్ లామిచానే దోషిగా తేలడంతో అతనికి 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఖాట్మండు జిల్లా కోర్టు సందీప్‌కు గురువారం (జనవరి 11) శిక్షను ప్రకటించింది. శిక్షతో పాటు, సందీప్ కోర్టుకు 3 లక్షల రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తీర్పు వెలువరించింది. ఇందులో బాధితురాలికి 2 లక్షల రూపాయలు ( భారతీయ కరెన్సీలో 1.24 లక్షలు) చెల్లించాల్సి ఉంటుందని తీర్పులో సూచించింది కోర్టు. అయితే తీర్పు ప్రకటించేటప్పుడు లామిచాన్ కోర్టులో లేడు, కాబట్టి అతన్ని ఇంకా అరెస్టు చేయలేదు. తీర్పు వెలువడిన తర్వాత ఈ నిర్ణయంపై హైకోర్టులో అప్పీలు చేస్తామని సందీప్ తరపు న్యాయవాది సరోజ్ ఘిమిరే తెలిపారు. కేసు వివరాల్లోకి వెళితే.. ఆగస్ట్ 2022లో ఖాట్మండులోని హోటల్ గదిలో సందీప్ తనపై అత్యాచారం చేశాడని 17 ఏళ్ల బాలిక ఆరోపించింది. దీంతో సందీప్‌ని అరెస్టు చేశారు. జనవరి 2023లో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకు వచ్చాడు సందీప్.
బెయిల్‌పై బయటకు వచ్చిన సందీప్ మళ్లీ నేపాలీ జట్టుకు ఆడడం ప్రారంభించాడు. అయితే కొన్ని రోజుల వ్యవధిలోనే అత్యాచారం కేసులో సందీప్‌ను దోషిగా ప్రకటించింది కోర్టు. చార్జిషీట్ సమర్పించిన తర్వాత లామిచాన్ బ్యాంకు ఖాతా, ఆస్తులను సీజ్ చేశారు. సందీప్ 2016లో తొలిసారి అండర్-19 ప్రపంచకప్ జట్టుకు ఆడాడు. అలాగే రెండేళ్ల పాటు ఐపీఎల్ ఆడాడు. అతను 2018, 2019 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. నేపాల్ తరఫున 51 వన్డే మ్యాచ్‌లు ఆడిన సందీప్ 112 వికెట్లు తీశాడు. 20 టీ20 మ్యాచుల్లో నేపాల్ తరఫున 98 వికెట్లు తీశాడు. ఇవి కాకుండా బిగ్ బాష్ లీగ్, CPIL వంటి మెగా క్రికెట్ టోర్నీల్లోనూ ఆడాడు సందీప్ లమిచానే. జైలు శిక్షతో సందీప్ క్రికెట్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. అతని కెరీర్ ముగిసినట్టేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
बलात्कार मुद्दामा जेल सजाय सुनाइएका क्रिकेटर सन्दीप लामिछानेलाई नेपाल क्रिकेट संघ (क्यान) ले निलम्बन गरेको छ। लामिछानेलाई घरेलु तथा अन्तर्राष्ट्रिय सबै प्रकारका क्रिकेट गतिविधिबाट निलम्बन गरेको जानकारी दिएका छन्।#SandeepLamichhane pic.twitter.com/FIBRZDs2o3
— Kusum Lamichhane ❣️ (@officialkusum90) January 11, 2024
Great to start the tournament with a win yesterday. Looking forward to the next one tomorrow. #PCC2023 #ParsaXi #NepalCricket pic.twitter.com/KM8wFO87vP
— Sandeep Lamichhane (@Sandeep25) December 22, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..