T20 World Cup: చివరి మ్యాచ్‌లో ఓటమి.. కట్‌చేస్తే.. రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ మాజీ ఫ్రెండ్
David Wiese Retirement: టీ20 ప్రపంచకప్‌లో 34వ మ్యాచ్‌లో ఇంగ్లండ్, నమీబియా జట్లు తలపడ్డాయి. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 10 ఓవర్లలో 5 వికెట్లకు 122 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నమీబియా జట్టు 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 84 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ ఓటమితో నమీబియా జట్టు స్టార్ ప్లేయర్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై ప్రకటించాడు.
David Wiese Retirement: నమీబియా స్టార్ ఆల్ రౌండర్ డేవిడ్ వైస్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆంటిగ్వాలోని నార్త్ సౌండ్‌లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో తన చివరి మ్యాచ్ ఆడడం ద్వారా డేవిడ్ వైజా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు.
2013 నుంచి 2016 వరకు దక్షిణాఫ్రికా జట్టుకు ప్రాతినిథ్యం వహించిన డేవిడ్ వైజా ఆ తర్వాత నమీబియాకు కొత్త కెరీర్‌ను ప్రారంభించాడు. ఇప్పుడు తన 11 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.
డేవిడ్ వైజా కెరీర్..
వన్డే క్రికెట్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన డేవిడ్ వైజా 330 పరుగులు చేసి 15 వికెట్లు పడగొట్టాడు. 54 టీ20 మ్యాచ్‌ల్లో 624 పరుగులు, 59 వికెట్లు కూడా తీశాడు.
ఐపీఎల్‌లో ప్రదర్శన..
View this post on Instagram
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో RCB, KKR తరపున మొత్తం 18 మ్యాచ్‌లు ఆడిన డేవిడ్ వైజా 148 పరుగులు చేసి 16 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన ఏకైక ఆటగాడిగా డేవిడ్ వీజా రికార్డ్ సృష్టించాడు.
డేవిడ్ వైజా 2015లో దక్షిణాఫ్రికా జట్టులో ఉన్నప్పుడు RCB జట్టుకు ఎంపికయ్యాడు. అలాగే, రెండు సీజన్లలో ఆడిన వైజా మొత్తం 15 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టాడు.
దీని తర్వాత, నమీబియా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన డేవిడ్ వైజా, IPL 2023లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఎంపికయ్యాడు. దీంతో ఐపీఎల్‌లో రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు.
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డేవిడ్ వైజా రానున్న రోజుల్లో ఫ్రాంచైజీ లీగ్‌లో కొనసాగే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..