లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నమీబియాకు మైకేల్ వాన్ లింగెన్, నికోలస్ డెవ్లిన్ జోడీ శుభారంభం అందించింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 44 పరుగులు జోడించారు. అయితే, ఈ సమయంలో నికోలస్ డెవ్లిన్ 16 బంతుల్లో 18 పరుగులు చేసి రిటైర్ అయ్యాడు. ప్రపంచకప్ చరిత్రలో ఏ బ్యాట్స్‌మెన్ అయినా రిటైరవడం ఇదే తొలిసారి. నికోలస్ జట్టుకు అవసరమైనంత వేగంగా పరుగులు చేయడం లేదు. అందుకే అతను రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో పాటు ఈ రికార్డు కూడా ఆయన పేరిట నమోదైంది.