విజయ్ శంకర్ గాయం నిజమేనా!

న్యూఢిల్లీ: ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌కు నిజంగానే గాయం అయిందా..? లేక గాయం సాకుతో ఉద్దేశపూర్వకంగా తప్పించారా.? ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో జరుగుతున్న పెద్ద చర్చ. బొటన వేలి గాయంతో విజయ్ శంకర్ టోర్నీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఇక అతని స్థానంలో కర్ణాటక బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే శంకర్ గాయంపై మాత్రం అనేక అనుమానాలు నెలకొన్నాయి. జూన్ 19న నెట్ ప్రాక్టీస్‌లో బుమ్రా వేసిన యార్కర్‌తో విజయ్‌కు గాయమైనది […]

విజయ్ శంకర్ గాయం నిజమేనా!

Updated on: Jul 03, 2019 | 4:56 AM

న్యూఢిల్లీ: ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌కు నిజంగానే గాయం అయిందా..? లేక గాయం సాకుతో ఉద్దేశపూర్వకంగా తప్పించారా.? ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో జరుగుతున్న పెద్ద చర్చ. బొటన వేలి గాయంతో విజయ్ శంకర్ టోర్నీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఇక అతని స్థానంలో కర్ణాటక బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే శంకర్ గాయంపై మాత్రం అనేక అనుమానాలు నెలకొన్నాయి.

జూన్ 19న నెట్ ప్రాక్టీస్‌లో బుమ్రా వేసిన యార్కర్‌తో విజయ్‌కు గాయమైనది అని వార్తలు వచ్చాయి. అయితే అది పెద్దగా ఇబ్బంది అనిపించకపోవడంతో భారత్ ఆడిన తర్వాత మ్యాచ్‌లకు అతడు బరిలోకి దిగాడు. ఇది ఇలా ఉంటే ఇంగ్లాండ్‌తో ఆడబోయే మ్యాచ్ ముందు టీమ్ మేనేజ్‌మెంట్.. శంకర్‌కు గాయం తిరగబెట్టిందని.. అందుకే అతను వరల్డ్‌కప్ నుంచి తప్పుకుంటున్నాడని ప్రకటించింది. ఇక ఇప్పుడిదే అనుమానాలు రేకెత్తిస్తోంది. ఓ గాయపడిన ఆటగాడు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా మైదానంలోకి డ్రింక్స్‌ ఎలా తెచ్చాడు.? అంటూ టీమిండియా మాజీ క్రికెటర్‌ మురళీ కార్తిక్‌ ట్విటర్‌ వేదికగా ప్రశ్నించాడు. ఒకరోజు ముందు జట్టులో ఉన్నాడు. బ్యాటింగ్‌ బాగానే చేశాడు. దురదృష్టవశాత్తు ఓ మంచి బంతికి ఔటయ్యాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా గాయంతోనే చక్కగా పరుగెత్తుతూ డ్రింక్స్‌ అందించాడు. నేడు టోర్నీ నుంచి నిష్క్రమించాడు. వెంటనే మరొకరు భర్తీ అయ్యారు. దీంతో నేనొక్కడినే అయోమయానికి గురైనట్టున్నా? అని సెటైరికల్‌గా ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అటు మురళీ కార్తీక్ వాదనలను ఏకీభవిస్తూ అభిమానులు సైతం బీసీసీఐను నిలదీస్తున్నారు. శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్ గాయాల బారిన పడినప్పుడు.. వారి పరిస్థితిని అప్‌డేట్ చేస్తూ వచ్చి.. శంకర్ విషయంలో మాత్రం ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. గాయం పేరుతో ఉద్దేశపూర్వకంగానే తప్పించారా.? ఒకవేళ అతను గాయపడితే.. ఆ పరిస్థితిలో అతని చేత ఎందుకు డ్రింక్స్ తెప్పించుకున్నారు.? అని అడుగుతున్నారు.