AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shreyas Iyer: గ్రౌండ్‏కు దూరమైనా బయట రచ్చ చేస్తున్న ముంబై కింగ్ .. శ్రేయస్ అయ్యర్ హెలికాప్టర్ ఎంట్రీ అదుర్స్!

ప్రస్తుతం మైదానంలో కనిపించకపోయినా, భారత స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ మాత్రం బయట తెగ హల్‌చల్ చేస్తున్నాడు. ఇటీవల ఆయన ఒక ఈవెంట్‌లో ఇచ్చిన హెలికాప్టర్ ఎంట్రీ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. 'ముంబై రాజు' ఎలా ఉంటాడో చూపించిన శ్రేయస్, తన స్టైల్, స్వ్యాగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు.

Shreyas Iyer: గ్రౌండ్‏కు దూరమైనా బయట రచ్చ చేస్తున్న ముంబై కింగ్ ..  శ్రేయస్ అయ్యర్ హెలికాప్టర్ ఎంట్రీ అదుర్స్!
Shreyas Iyer
Rakesh
|

Updated on: Jul 29, 2025 | 11:35 AM

Share

Shreyas Iyer:ప్రస్తుతం క్రికెట్ మైదానానికి దూరంగా ఉన్న భారత స్టార్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్‎కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో శ్రేయస్ హెలికాప్టర్ నుంచి దిగుతూ స్టైలిష్‌గా ఎంట్రీ ఇవ్వడం కనిపిస్తుంది. బ్లాక్ షర్ట్, వైట్ ప్యాంట్ ధరించి, నుదుట ఎర్రటి బొట్టు, కాలర్ బటన్లు విప్పి, మెడలో లావుపాటి చైన్‌తో అతని లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. నెట్టింట్లో తన స్టైల్ ను నెట్టింట్లో సీఎం స్టైల్ అని పిలుస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియో మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా, విరార్ వెస్ట్‌లో ఉన్న న్యూ వివా కాలేజీకి సంబంధించింది. అక్కడ జరిగిన క్షితిజ్ ఉత్సవ్ దహి హండి ప్రీమియర్ లీగ్ కార్యక్రమంలో శ్రేయస్ అయ్యర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ కోసం శ్రేయస్ కాలేజ్ గ్రౌండ్‌లోనే హెలికాప్టర్ నుంచి దిగడం విశేషం. అభిమానుల హూటింగ్, సెల్ఫీల కోసం పోటీపడటం, పెద్ద ఎత్తున చప్పట్లతో ఆయనకు ఘన స్వాగతం లభించింది.

శ్రేయస్ అయ్యర్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఈ ఈవెంట్‌లో ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది. అతను బ్లాక్ షర్ట్ వేసుకుని, పై బటన్లు విప్పి, తెల్లటి ప్యాంట్‌తో కనిపించాడు. నుదుట ఎర్రటి బొట్టు, లావుపాటి చైన్‌తో చూసేందుకు అచ్చం ఒక స్టార్ హీరో లాగానో, లేదా ఒక రాజకీయ నాయకుడిలాగానో కనిపించాడు. అతని ఈ లుక్ చూసి సోషల్ మీడియా యూజర్లు ముఖ్యమంత్రి, సర్పంచ్ సాబ్, ముంబైకి కొత్త రాజు అంటూ రకరకాలుగా పోలుస్తూ కామెంట్లు పెడుతున్నారు.

శ్రేయస్ అయ్యర్‌ను ఒక్కసారి చూడటానికి కాలేజీ విద్యార్థులు, అక్కడి అభిమానులు ఆతృతగా ఉన్నారు. చాలా మంది అభిమానులు అతనితో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు. వీడియోలో శ్రేయస్ అయ్యర్ కూడా అందరితో చాలా సరదాగా, నవ్వుతూ, ఫోటోలు దిగుతూ కనిపించాడు. క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే, గత సంవత్సరం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించిన శ్రేయస్ అయ్యర్‌ను ఏప్రిల్ 2025లో తిరిగి సెంట్రల్ కాంట్రాక్ట్‎లోకి తీసుకున్నారు. అయ్యర్ చివరిసారిగా భారత్ తరఫున ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో ఆడాడు. ఆ తర్వాత అతను ఐపీఎల్ 2025 లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. వెంటనే, ముంబై టీ20 లీగ్‌లో కూడా పాల్గొన్నాడు, అక్కడ అతని జట్టు విజేతగా నిలిచింది. శ్రేయస్ ఇటీవల కాలంలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ వైరల్ వీడియో తర్వాత అతని అభిమానులు ఇప్పుడు అతను మళ్లీ మైదానంలోకి ఎప్పుడు అడుగుపెడతాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..