RR vs MI: డబుల్ హ్యాట్రిక్‌తో ముంబై దూకుడు.. ఇటు రాజస్థాన్, అటు బెంగళూరుకు ఇచ్చిపడేశారుగా

Rajasthan Royals vs Mumbai Indians: ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్‌ దూసుకెళ్తోంది. వరుసగా 6 విజయాలతో అట్టడుగు నుంచి అగ్రస్థానం చేరింది. ఈ జట్టుకు తొలుత వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడింది. ఆ తర్వాత డబుల్ హ్యాట్రిక్‌తో ప్రత్యర్థులకు షాకిస్తోంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అద్భుతంగా రాణించి 100 పరుగుల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 217 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా రాజస్థాన్ 20 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. 16.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ముంబై ఏకంగా 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పాయింట్ల పట్టికలోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును వెనక్కు నెట్టి అగ్రస్థానంలో నిలిచింది.

RR vs MI: డబుల్ హ్యాట్రిక్‌తో ముంబై దూకుడు.. ఇటు రాజస్థాన్, అటు బెంగళూరుకు ఇచ్చిపడేశారుగా
Rr Vs Mi Ipl 2025 Result

Updated on: May 02, 2025 | 6:19 AM

Rajasthan Royals vs Mumbai Indians: ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్‌ దూసుకెళ్తోంది. వరుసగా 6 విజయాలతో అట్టడుగు నుంచి అగ్రస్థానం చేరింది. ఈ జట్టుకు తొలుత వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడింది. ఆ తర్వాత డబుల్ హ్యాట్రిక్‌తో ప్రత్యర్థులకు షాకిస్తోంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అద్భుతంగా రాణించి 100 పరుగుల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 217 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా రాజస్థాన్ 20 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. 16.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ముంబై ఏకంగా 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పాయింట్ల పట్టికలోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును వెనక్కు నెట్టి అగ్రస్థానంలో నిలిచింది.

ముంబై డబుల్ హ్యాట్రిక్..

రాజస్థాన్ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్ టాస్ ఓడిపోయింది. కానీ, టాస్ గెలిచిన ఆనందాన్ని రాజస్థాన్‌కు ఏమాత్రం కలిగించలేకపోయింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్, రికెల్టన్ జోడీ తొలి వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రికెల్టన్ కేవలం 38 బంతుల్లో 61 పరుగులు చేయగా, రోహిత్ 36 బంతుల్లో 53 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఇద్దరూ 23 బంతుల్లో తలో 48 పరుగులు చేశారు.

బౌలింగ్‌లో బుమ్రా, బోల్ట్, కర్ణ్ శర్మ దూకుడు..

రాజస్థాన్ రాయల్స్ జట్టు గుజరాత్ టైటాన్స్‌పై చేసినట్లే ముంబై ఇండియన్స్‌పైనా తుఫాన్ ఆటతో అలరిస్తుందని అంతా భావించారు. కానీ బౌల్ట్, బుమ్రా ఆ ఆశలను వమ్ము చేశారు. తొలుత దీపక్ చాహర్ వైభవ్ సూర్యవంశీని 0 పరుగుల వద్ద అవుట్ చేయగా, బౌల్ట్ యశస్వి జైస్వాల్, నితీష్ రానాలను అవుట్ చేశాడు. తర్వాత బుమ్రా వచ్చి రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్‌కి పెవిలియన్‌కు దారి చూపించాడు. తర్వాతి బంతికే షిమ్రాన్ హెట్మెయర్ కూడా ఔటయ్యాడు.

ఇవి కూడా చదవండి

పవర్ ప్లేలో 5 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్..

పవర్ ప్లేలోనే రాజస్థాన్ రాయల్స్ 5 వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత కూడా రాజస్థాన్ కష్టాలు ఏమాత్రం తీరలేదు. శుభమ్ దూబేను అవుట్ చేయడం ద్వారా హార్దిక్ పాండ్యా రాజస్థాన్ చివరి ఆశను ముగించాడు. లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ మిగిలిన పనిని పూర్తి చేశాడు. అతను ధ్రువ్ జురెల్‌ను 11 పరుగులకే అవుట్ చేశాడు. మహీష్ తీక్షణ, కుమార్ కార్తికేయ వికెట్లను కూడా తీసుకున్నాడు. చివరికి, బౌల్ట్ ఆర్చర్‌ను అవుట్ చేసి రాజస్థాన్ ఇన్నింగ్స్‌ను 117 పరుగుల వద్ద ముగించాడు. ముంబై చేతిలో ఈ ఓటమి తర్వాత, రాజస్థాన్ జట్టు ఐపీఎల్ 2025 నుంచి నిష్క్రమించింది. ఇంతలో, ముంబై ప్లేఆఫ్ వైపు మరో అడుగు ముందుకు వేసింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..