WPL 2023: 38 బంతుల్లో 202 స్ట్రైక్‌రేట్‌తో బీభత్సం.. నాడు జావెలిన్ త్రోయింగ్‌.. నేడు క్రికెట్‌లో దూసుకపోతోన్న ప్లేయర్..

|

Mar 07, 2023 | 10:10 AM

Hayley Matthews: రూ.40 లక్షలకు హేలీ మాథ్యూస్‌ను ముంబై ఇండియన్స్‌ దక్కించుకుంది. అయితే, గేమ్ స్టార్ట్ అయ్యాక.. తుఫాన్ బ్యాటింగ్‌తో రెచ్చిపోతూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది.

WPL 2023: 38 బంతుల్లో 202 స్ట్రైక్‌రేట్‌తో బీభత్సం.. నాడు జావెలిన్ త్రోయింగ్‌.. నేడు క్రికెట్‌లో దూసుకపోతోన్న ప్లేయర్..
Hayley Matthews
Follow us on

తొలుత చేతితో బల్లెం అందుకుని నేరుగా పతకంపై గురిపెట్టింది. అనంతరం బ్యాట్ పట్టుకేని పరుగుల వర్షం కురిపించింది. ఈ ప్లేయర్ మహిళా క్రికెటర్ ఇమేజ్‌ని వర్ణించడానికి ఇంతకంటే మంచి మార్గం మరొకటి ఉండదు. ఎందుకంటే ఈమె ప్రతి పనిలోనూ నిపుణురాలిగా పేరుగాంచింది. అప్పుడు నీరజ్ చోప్రా జావెలిన్ లాగా.. ఇప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ లాగా దూసుకపోతోంది. రెండు క్రీడల్లోనూ తన పేరుతో ఎన్నో రికార్డులు, పతకాలు సాధించింది ఇక తాజాగా WPLలో RCBపై ముంబై ఇండియన్స్ విజయాన్ని తన బ్యాట్‌తో అందించి వార్తల్లో నిలిచింది. ఆమె వెస్టిండీస్ మహిళా క్రికెటర్ హేలీ మాథ్యూస్.

హేలీ మాథ్యూస్ RCBకి వ్యతిరేకంగా 60 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసింది. ఈ సమయంలో ఆడిన 38 బంతుల్లో 202 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేసింది. 13 ఫోర్లు, 1 సిక్స్‌తో 77 పరుగులు చేసింది. అయితే, ఆ తర్వాత కూడా మాథ్యూస్‌ను ఏ RCB బౌలర్ కూడా అవుట్ చేయలేకపోయారు. అయితే, జట్టుకు విజయాన్ని అందించిన తర్వాత ఆమె అజేయంగా తిరిగి వచ్చింది.

WPLలో నక్క తోక తొక్కిన మాథ్యూస్..

ఇవి కూడా చదవండి

మాథ్యూస్ WPL ఆడటం వెనుక కథ కూడా ఆసక్తికరంగా ఉంది. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించి, భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ లాగా కేవలం 38 బంతుల్లోనే పరుగులు చేసింది. అదృష్టవశాత్తూ ఆమెకు ఈ అవకాశం దక్కింది. WPL వేలంలో ఆమె పేరు మొదటిసారి వినిపించినప్పుడు, ఏ జట్టు ఆమెపై బెట్టింగ్‌లు వేయలేదు. అంటే ఆమె మొదటి బిడ్‌లో అమ్ముడుకాలేదు. రెండవసారి వేలంలోకి వచ్చిన వెంటనే ముంబై ఇండియన్స్ ఆమె ప్రాథమిక ధరకు అంటే రూ. 40 లక్షలకు కొనుగోలు చేసింది.

రూ. 40 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు..

ప్రస్తుత ఆట చూస్తుంటే రూ. 40 లక్షలకు బదులుగా ముంబై ఇండియన్స్‌కు మాథ్యూస్ ఎలాంటి ప్రదర్శన ఇస్తున్నారో తెలుసుకోవచ్చు. ఆమె సృష్టించిన గందరగోళం RCBపై పడింది. ఆ జట్టుకు వ్యతిరేకంగా 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో హేలీ మాథ్యూస్ తుఫాను ఇన్నింగ్స్ ఆడింది.

పురుషుల క్రికెట్‌ ఆడిన మాథ్యూస్..

మాథ్యూస్‌లో విపరీతమైన ట్యాలెంట్ ఉంది. ఆమె ఈ ఆటకు ఎటువంటి అడ్డంకిని పట్టించుకోలేదు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఆడటం మొదలుపెట్టింది. ఆమె 18 ఏళ్ల వయసులో వెస్టిండీస్‌లోని పురుషుల ఫస్ట్ డివిజన్ క్రికెట్‌లో కూడా ఆడింది. అలాగే షే హోప్ వంటి పురుషుల కరీబియన్ క్రికెటర్లతోనూ కలసి క్రికెట్ ఆడింది.

జావెలిన్‌లో నీరజ్ చోప్రా కంటే తక్కువేం కాదు..

అయితే, ఈ గేమ్‌లో బ్యాట్ పట్టకముందే జావెలిన్ గేమ్‌లోనూ తనదైన ముద్ర వేసింది. జావెలిన్ త్రోయర్‌గా, హేలీ మాథ్యూస్ అండర్ -17, అండర్ -18 స్థాయిలలో అనేక పతకాలను గెలుచుకుంది. 2014 CARIFTA గేమ్స్‌లో రజత పతకాన్ని గెలుచుకుంది. ఆ మరుసటి సంవత్సరం అంటే 2015లో స్వర్ణం గెలిచింది. అలాగే జూనియర్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని కూడా దక్కించుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..