AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Indians : ముంబై ఇండియన్స్‌లో భారీ ప్రక్షాళన..హార్దిక్ పాండ్యాతో పాటు ఆ సీనియర్ స్టార్ బ్యాటర్‌ కూడా అవుట్

Mumbai Indians : ముంబై ఇండియన్స్ జట్టులో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఒక సీనియర్ బ్యాటర్‌ను రాబోయే ఐపీఎల్ 2027 సీజన్ నాటికి మెల్లగా జట్టు నుంచి ఫేజ్ అవుట్ చేయాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అయితే ఆ ఆటగాడిని పూర్తిగా దూరం పెట్టకుండా.. ఫ్రాంచైజీలో అతనికి ఒక కొత్త బాధ్యత లేదా వేరే రోల్ ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం.

Mumbai Indians : ముంబై ఇండియన్స్‌లో భారీ ప్రక్షాళన..హార్దిక్ పాండ్యాతో పాటు ఆ సీనియర్ స్టార్ బ్యాటర్‌ కూడా అవుట్
Mumbai Indians
Rakesh
|

Updated on: May 31, 2026 | 9:35 AM

Share

Mumbai Indians : ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ (MI) ఫ్రాంచైజీలో రాబోయే సీజన్ నాటికి భారీ మార్పులు జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్లోనూ ముంబై జట్టు ఘోర ప్రదర్శనతో నిరాశపరిచింది. 2024లో పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన ముంబై, ఈ 2026 సీజన్లోనూ 9వ స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో జట్టును పూర్తిగా రీసెట్ చేయాలని యాజమాన్యం గట్టిగా ఫిక్స్ అయింది. ఈ క్రమంలోనే కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టును వీడటం దాదాపు ఖాయం కాగా.. జట్టులోని మరో సీనియర్ స్టార్ బ్యాటర్‎ను కూడా పక్కన పెట్టేందుకు ముంబై ఇండియన్స్ సిద్ధమవుతోందనే వార్తలు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఆ సీనియర్ బ్యాటర్‌కు ఆట నుంచి విరామం..?

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. ముంబై ఇండియన్స్ జట్టులో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఒక సీనియర్ బ్యాటర్‌ను రాబోయే ఐపీఎల్ 2027 సీజన్ నాటికి మెల్లగా జట్టు నుంచి ఫేజ్ అవుట్ చేయాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అయితే ఆ ఆటగాడిని పూర్తిగా దూరం పెట్టకుండా.. ఫ్రాంచైజీలో అతనికి ఒక కొత్త బాధ్యత లేదా వేరే రోల్ ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం. నివేదికలో సదరు ఆటగాడి పేరును స్పష్టంగా ప్రస్తావించనప్పటికీ, ముంబై జట్టును పూర్తిగా యువ ఆటగాళ్లతో నింపి సరికొత్తగా నిర్మించడానికే ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ముంబై ఫ్యూచర్ కెప్టెన్ రేసులో ముగ్గురు

హార్దిక్ పాండ్యా నిష్క్రమణ వార్తల నడుమ.. ముంబై ఇండియన్స్ తదుపరి కెప్టెన్సీ కోసం ముగ్గురు స్టార్ ప్లేయర్ల పేర్లను పరిశీలిస్తోంది. అందులో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రేసులో ఉన్నారు. ఐపీఎల్ 2026 సీజన్లో హార్దిక్ పాండ్యా అందుబాటులో లేని సమయంలో సూర్యకుమార్ యాదవ్ మూడు మ్యాచ్‌లకు, బుమ్రా ఒక మ్యాచ్‌కు ముంబై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. అయితే వీరిద్దరితో పాటు టీమ్‌లోకి వచ్చిన కొద్ది కాలంలోనే అద్భుతంగా రాణిస్తున్న యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ పేరు కూడా ప్రస్తుతం కెప్టెన్సీ రేసులోకి రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

తిలక్ వర్మ వైపే మొగ్గు చూపుతున్న సీనియర్లు

ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో జరిగిన ముంబై ఇండియన్స్ అంతర్గత సమీక్షా సమావేశంలో ఒక ఆసక్తికరమైన చర్చ జరిగినట్లు సమాచారం. ముంబై జట్టులోని ఒక సీనియర్ ప్లేయర్.. వచ్చే ఏడాది నుంచి జట్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువ సంచలనం తిలక్ వర్మను కెప్టెన్‌గా నియమిస్తే బాగుంటుందని మేనేజ్‌మెంట్‌కు గట్టిగా సూచించారట. గత కొన్ని సీజన్లుగా తిలక్ వర్మ ముంబై జట్టులో ఎంతో నిలకడగా రాణిస్తున్నాడు. ప్రశాంతంగా ఉంటూనే బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడే గుణమున్న తిలక్ అయితేనే ఫ్యూచర్ లీడర్‌గా కరెక్ట్ అని సదరు సీనియర్ ప్లేయర్ అభిప్రాయపడినట్లు టాక్.

వర్కౌట్ కాని హార్దిక్ పాండ్యా ప్లాన్

ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు ఐదు సార్లు ముంబైకి ట్రోఫీ అందించిపెట్టిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి.. గుజరాత్ నుంచి హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ ద్వారా భారీ ధరకే ముంబై వెనక్కి తెచ్చుకుంది. అయితే ఈ భారీ కెప్టెన్సీ మార్పు ప్లాన్ ముంబైకి ఏమాత్రం కలిసిరాలేదు. హార్దిక్ సారథ్యంలో ముంబై వరుసగా రెండేళ్లు దారుణంగా విఫలమై పట్టికలో అడుగున నిలిచింది. ఈ ఘోర ఫ్లాప్ షో వల్లే ముంబై ఇండియన్స్‌కు ఇప్పుడు త్వరగా రిఫ్రెష్ బటన్ నొక్కడం తప్పనిసరి అయిపోయింది. రాబోయే మెగా వేలానికి ముందే ముంబైలో ఈ భారీ ప్రక్షాళన జరగనుందని స్పష్టమవుతోంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us