
ఐపిఎల్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మరో సరికొత్త రికార్డుకు చేరువయ్యాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన ధోనీ సేన ఐదింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మరికాసేపట్లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడబోతోంది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ కేవలం ఒకదాంట్లో విజయం సాధించి కింది నుంచి రెండో స్థానంలో ఉంది.
నేటి మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే ధోనీ ఖాతాలో అత్యంత అరుదైన రికార్డు వచ్చి చేరుతుంది. ఇప్పటి వరకు 99 విజయాలతో ఉన్న చెన్నైకి ఇది వందో విజయం అవుతుంది. అంతేకాదు, వంద ఐపీఎల్ మ్యాచుల్లో గెలిచిన జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఘనత కూడా అతడికి దక్కుతుంది. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు చెన్నై 165 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 99 మ్యాచుల్లో విజయం సాధించింది. నేటి మ్యాచ్‌లో గెలిచి విజయాల్లో సెంచరీ కొట్టాలని భావిస్తోంది. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఏ జట్టూ వంద విజయాలు సొంతం చేసుకోలేదు. కాబట్టి, నేటి మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే ఈ అరుదైన రికార్డు ధోనీ ఖాతాలో చేరుతుంది.