AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: ధోనీ వాటాల వార్తల్లో నిజం ఎంత? చెన్నై యాజమాన్యం క్లారిటీతో తెరపడిన ఉత్కంఠ

MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో ధోనీ వాటాలు కోరారనే ప్రచారంపై యాజమాన్యం స్పష్టత ఇచ్చింది. ధోనీ నుంచి అదనపు వాటాల కోసం ఎలాంటి ప్రతిపాదన రాలేదని తెలిపింది. అయితే గతంలో ప్రైవేట్ విక్రయం సమయంలో ధోనీ కొన్ని సీఎస్కే షేర్లు కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఐపీఎల్ 2027 వ్యూహాలు, కొత్త హెడ్ కోచ్ ఎంపికలో ధోనీ పాత్ర కీలకంగా ఉండనుంది.

MS Dhoni: ధోనీ వాటాల వార్తల్లో నిజం ఎంత? చెన్నై యాజమాన్యం క్లారిటీతో తెరపడిన ఉత్కంఠ
Ms Dhoni
Rakesh
|

Updated on: Sep 12, 2026 | 11:38 AM

Share

MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో ధోనీ వాటాలు కోరారనే ప్రచారం క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున కలకలం రేపింది. ఈ ఊహాగానాలపై సీఎస్కే యాజమాన్యం అధికారికంగా స్పందిస్తూ స్పష్టత ఇచ్చింది. అదే సమయంలో కొత్త కోచ్ ఎంపిక, రాబోయే ఐపీఎల్ వ్యూహాలపై కూడా కీలక సమాచారం వెలువడింది. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో వాటాలను కొనుగోలు చేయడానికి ధోనీ ఆసక్తి చూపించారని, అయితే ఆయన పెట్టిన షరతులకు యాజమాన్యం అంగీకరించలేదని కొన్ని వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ ప్రచారంపై సీఎస్కే పెద్ద అధికారి ఒకరు తీవ్రంగా స్పందించారు. ధోనీ నుంచి అలాంటి ప్రతిపాదన ఏది తమ వద్దకు రాలేదని, ఆయనతో దీనిపై ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. ఎన్ శ్రీనివాసన్‌తో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడారో లేదో తమకు తెలియదని వివరించారు.

షేర్ హోల్డింగ్ నిజాలు ఏమిటి?

గతంలో సీఎస్కే షేర్లు ప్రైవేట్ విక్రయానికి అందుబాటులో ఉన్న సమయంలో ధోనీ కొన్ని షేర్లను కొనుగోలు చేసిన మాట నిజమేనని ఫ్రాంచైజీ వర్గాలు వెల్లడించాయి. ఈ షేర్లు బహిరంగ మార్కెట్లో విక్రయించబడవు కాబట్టి ప్రైవేట్‌గానే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ధోనీ వద్ద లక్షకు పైగా షేర్లు ఉన్నప్పటికీ, మొత్తం ఫ్రాంచైజీ వాటాతో పోలిస్తే అది చాలా చిన్న భాగం మాత్రమే. ప్రస్తుతం శ్రీనివాసన్ కుటుంబం వద్దే 55 శాతానికి పైగా ప్రైవేట్ వాటాలు భద్రంగా ఉన్నాయి.

ధోనీ రాకతో కొత్త కోచ్ ఎంపిక

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ధోనీ సెప్టెంబర్ 22 నాటికి భారత్‌కు తిరిగి రానున్నారు. ఆయన స్వదేశానికి చేరుకున్న వెంటనే ఐపీఎల్ 2027 వేలానికి సంబంధించి, అలాగే ఆటగాళ్ల ట్రేడింగ్, బదిలీలపై సీఎస్కే యాజమాన్యం ఒక కీలక సమావేశం నిర్వహించనుంది. ప్రధానంగా సీఎస్కే కొత్త హెడ్ కోచ్ ఎంపికలో ధోనీ పాత్ర అత్యంత కీలకం కానుంది. ఒక విదేశీ దిగ్గజ ఆటగాడిని కోచ్‌గా నియమించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అభిమానుల్లో ఎన్నో సందేహాలు ఉన్నప్పటికీ ధోనీ, సీఎస్కే బంధం ఎప్పటిలాగే బలంగా ఉంది. సెప్టెంబర్ చివరి వారంలో జరగబోయే సీఎస్కే సమావేశం తర్వాత కొత్త కోచ్ ఎవరనే దానిపై పూర్తి స్పష్టత రానుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us