AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: బంగారం, వెండి ఎందుకు కొనాలి..? రాబర్ట్ కియోసాకి చెప్పిన ఈ లెక్కలు చూస్తే అదుర్స్..

బంగారం, వెండి గురించి రాబర్ట్ కియోసాకి చేసే వ్యాఖ్యలు ఎప్పుడూ చర్చనీయాంశంగా మారుతూ ఉంటాయి. వీటిల్లో పెట్టుబడులు పెట్టాలని ఆయన ఎప్పటినుంచో ఇన్వెస్టర్లను ప్రోత్సహిస్తున్నారు. తాజాగా బంగారం, వెండి వంటి ఆభరణాలు కష్టకాలంలో ఎలా ఉపయోగపడతాయనేది వివరించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం.

Gold: బంగారం, వెండి ఎందుకు కొనాలి..? రాబర్ట్ కియోసాకి చెప్పిన ఈ లెక్కలు చూస్తే అదుర్స్..
Robert Kiyosaki
Venkatrao Lella
|

Updated on: Oct 05, 2026 | 12:55 PM

Share

బంగారం, వెండి, బిట్ కాయిన్ వంటి పెట్టుబడులపై రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌గా ఉంటూ ఉంటాయి. బంగారం, వెండి, బిట్ కాయిన్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆయన ఎప్పుడూ ఇన్వెస్టర్లకు సూచిస్తున్నారు. భవిష్యత్తులో వీటి ధరలు రికార్డ్ స్థాయికి పెరిగే అవకాశముందని, ఇప్పుడే ఇన్వెస్ట్ చేసే అప్పటికీ భారీగా లాభాలు పొందవచ్చి సలహాలు ఇస్తు్న్నారు. కష్టకాలంలో బంగారం, వెండి ఆదుకుంటుంటూ సూచిస్తూ వస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే ఆయన.. ఎప్పుటికప్పుడు ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటూ ఉంటారు. తాజాగా బంగారం, వెండి ధరలపై ఆయన చేసే వ్యాఖ్యలు మరోసారి వైరల్‌గా మారాయి. కష్టకాలంలో బంగారం ఆసరాగా ఎలా ఉంటుందనేది ఆయన వివరించారు.

“నేను ఎందుకు ఒక ప్రిప్పర్‌ని? మొన్న ఒక రోజు ఒక బృందంతో మాట్లాడుతూ.. నేను ఒక ప్రిప్పర్‌ని అని చెప్పాను. ఒక మహిళ చేయి పైకెత్తి.. “మీరు ప్రిప్పర్ అయితే, మీరు నిరాశావాదిగా ఉండటం లేదా? సానుకూల ఆలోచన ఆరోగ్యకరమైనది కాదా?” అని ప్రశ్నించింది. నేను “మీ కారుకు ఇన్సూరెన్స్ ఉందా?” అని ఆమెను అడిగాను. ఆమె “ఉంది” అని జవాబిచ్చింది. “మీరు ప్రమాదం జరగాలని ఆశిస్తున్నారా?” అని అడిగాను. ఆమె లేదు అని సమాధానమిచ్చింది. ఒకవేళ ప్రమాదం జరిగితే ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో కారుకు ఇన్సూరెన్స్ తీసుకున్నారు.. మరి మీ దగ్గర బంగారం, వెండి, బిట్‌కాయిన్ ఏమైనా ఉన్నాయా?” అని అడిగాను. ఆమె, “లేదు” అని చెప్పింది. “ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు మీ డబ్బుకు ఏమవుతుంది?” అని అడిగాను. “ప్రభుత్వం ఇంకా ఎక్కువ ముద్రిస్తుంది.” “మరి మీ డబ్బు కొనుగోలు శక్తికి ఏమవుతుంది?” అని అడిగాను. ఆమె దానికి సమాధానమిస్తూ “దాని కొనుగోలు శక్తి తగ్గిపోతుందా?” అని జవాబిచ్చింది. మరి దాన్నేద్రవ్యోల్బణం అంటారా? అని ఆమె వెటకారంగా నవ్వింది. ఫెడ్, ప్రభుత్వం చట్టబద్ధంగా మన డబ్బు ద్వారా మన సంపదను దొంగిలిస్తాయి..ఎందుకంటే వారు దానిని ముద్రించగలరు.. పన్నులు, ద్రవ్యోల్బణం ద్వారా మన సంపదను దొంగిలిస్తారు.. ప్రభుత్వం ముద్రించలేని డబ్బు మాత్రమే నాకు కావాలి.నాకు చమురు బావులు కూడా ఉన్నాయి. ప్రభుత్వాలు చమురును పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తాయి.వాళ్ళు నాకు డబ్బు ఇస్తారు అని చెప్పాను. “అందుకేనా మీరు ఆర్థికంగా ముందుచూపుతో ఉండే వ్యక్తి?” అంటూ ఆమె నవ్వుతూ చెప్పింది” అంటూ కియోసాకి తన ఎక్స్ అకౌంట్లో పేర్కొన్నారు.

ఈ పోస్ట్ ద్వారా  బంగారం, వెండి లాంటి ఆస్తులు మనల్ని ఆపద కాలంల రక్షిస్తాయని రాబర్ట్ కియోసాని పరోక్షంగా చెబుతున్నారు. గత కొంతకాలంగా వీటిల్లో పెట్టుబడులు పట్టాలని కియోసాకి సూచిస్తున్నారు. వీటి ధరల గురించి ఆయన వెల్లడించే అంచనాలు ఎప్పటికప్పుడు నిజమవుతున్నాయి.

Follow Us