AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI 1st T20I: వైభవ్‎నా? సంజూనా ? తుది జట్టు నుంచి తప్పించేది ఎవరినో తెలుసా?

IND vs WI 1st T20I : భారత్, వెస్ట్ ఇండీస్ మధ్య లక్నో వేదికగా జరగబోయే తొలి టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ లేదా సంజూ శామ్సన్‌లలో ఒకరిని తప్పించడంపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు. గణాంకాల ప్రకారం సంజూ శామ్సన్ కంటే వైభవ్ సూర్యవంశీ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు.

IND vs WI 1st T20I: వైభవ్‎నా? సంజూనా ? తుది జట్టు నుంచి తప్పించేది ఎవరినో తెలుసా?
Sanju Samson
Rakesh
|

Updated on: Oct 05, 2026 | 1:03 PM

Share

IND vs WI 1st T20I: భారత్, వెస్ట్ ఇండీస్ మధ్య అక్టోబర్ 6, 2026 మంగళవారం లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా మొదటి టీ20 సమరం జరగనుంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా ఇప్పుడు టీ20 సిరీస్‌పైనా కన్నేసింది. అయితే తొలి మ్యాచ్‌కి ముందు భారత మేనేజ్‌మెంట్ ముందు ఒక పెద్ద సవాలు వచ్చిపడింది. యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ, స్టార్ వికెట్ కీపర్ సంజూ శామ్సన్ లలో ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలి, ఎవరిని బెంచ్ మీద కూర్చోబెట్టాలి అనే విషయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు.

టీమ్ కాంబినేషన్ మారడంతో తిప్పలు

ఏషియన్ గేమ్స్ 2026లో భారత్ ఐదుగురు బౌలర్ల విధానంతో బరిలోకి దిగడం వల్ల వైభవ్ సూర్యవంశీ, సంజూ శామ్సన్ ఇద్దరికీ తుది జట్టులో చోటు దక్కింది. ఆ సమయంలో రికార్డు వికెట్ల బౌలర్ అర్ష్‌‌దీప్ సింగ్‌ను పక్కన పెట్టి, జస్ప్రీత్ బుమ్రాతో పాటు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్‌లను ఆడించారు. ఐదో బౌలర్ కోటాను శివమ్ దూబే, అభిషేక్ శర్మ భర్తీ చేశారు. స్వదేశంలో కరీబియన్లతో జరిగే సిరీస్‌లో జట్టు సమతుల్యత కోసం కచ్చితంగా ఆరో బౌలర్ అవసరం ఉంటుంది. అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వస్తే వీరిద్దరిలో ఒకరు బెంచ్‌కే పరిమితం కాక తప్పదు.

ఫామ్ పరంగా ఎవరికి అవకాశాలు ఎక్కువ?

ఇటీవల ముగిసిన ఏషియన్ గేమ్స్ గణాంకాలు పరిశీలిస్తే సంజూ శామ్సన్ కంటే వైభవ్ సూర్యవంశీ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. సంజూ శామ్సన్ రెండు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 9 పరుగులు (శ్రీలంకపై 7, పాకిస్థాన్‌పై 2) మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. వైభవ్ సూర్యవంశీ లంకపై క్లిష్టమైన పిచ్‌పై 21 బంతుల్లో 38 పరుగులు చేసి జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు, పాకిస్థాన్‌తో ఫైనల్‌లో 15 రన్స్ చేశాడు. ప్రస్తుత ఫామ్ చూస్తుంటే వైభవ్ వైపే మేనేజ్‌మెంట్ మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

వెస్టిండీస్‌తో తొలి టీ20కి జట్టు

లక్నో వేదికగా జరిగే ఈ పోరులో టీమిండియా పక్కా ప్లానింగ్‌తో బరిలోకి దిగుతోంది. ఓపెనర్లుగా వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ వచ్చే అవకాశముంది. వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ రీఎంట్రీ ఇస్తుండగా, మిడిలార్డర్ బాధ్యతలను శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే మోయనున్నారు. ఆల్‌రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగుతుండగా, స్పిన్ విభాగంలో రవి బిష్ణోయ్, ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చిన్నప్పుడు గొర్రెలు కాశాడు.. ఇప్పుడు IPS అధికారి అయ్యాడు!
చిన్నప్పుడు గొర్రెలు కాశాడు.. ఇప్పుడు IPS అధికారి అయ్యాడు!
ప్రియుడిని పెళ్లి చేసుకున్న అర్జున్ చిన్న కూతురు..
ప్రియుడిని పెళ్లి చేసుకున్న అర్జున్ చిన్న కూతురు..
ప్రతిరోజూ తలస్నానం చేయడం మంచిదేనా? జలుబు వస్తుందనేది నిజమేనా?
ప్రతిరోజూ తలస్నానం చేయడం మంచిదేనా? జలుబు వస్తుందనేది నిజమేనా?
దీపావళికి ఇంటిని శుభ్రం చేస్తున్నారా? వాస్తు ప్రకారం ఈ నియమాలు..
దీపావళికి ఇంటిని శుభ్రం చేస్తున్నారా? వాస్తు ప్రకారం ఈ నియమాలు..
ఈ 3 పనులు పూర్తి చేస్తేనే పీఎం కిసాన్ సాయం.. కేంద్రం అలర్ట్..
ఈ 3 పనులు పూర్తి చేస్తేనే పీఎం కిసాన్ సాయం.. కేంద్రం అలర్ట్..
తుఫాన్‌ వస్తే ఇవి పాటించండి.. ఏపీ వాసులకు వాతావరణ శాఖ కీలక సూచనలు
తుఫాన్‌ వస్తే ఇవి పాటించండి.. ఏపీ వాసులకు వాతావరణ శాఖ కీలక సూచనలు
JEE Main 2027 దరఖాస్తుల షెడ్యూల్ విడుదల.. దరఖాస్తులు ఎప్పుడంటే?
JEE Main 2027 దరఖాస్తుల షెడ్యూల్ విడుదల.. దరఖాస్తులు ఎప్పుడంటే?
శ్రీకృష్ణుడి విశ్వరూపం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే.. వేయి తలలు..
శ్రీకృష్ణుడి విశ్వరూపం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే.. వేయి తలలు..
CLAT 2027 ఇంకా దరఖాస్తు చేసుకోలేదా..? అక్టోబర్ 31 వరకే ఛాన్స్!
CLAT 2027 ఇంకా దరఖాస్తు చేసుకోలేదా..? అక్టోబర్ 31 వరకే ఛాన్స్!
ఆర్టీసీ ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. అమల్లోకి కొత్త పథకం
ఆర్టీసీ ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. అమల్లోకి కొత్త పథకం