Mohammed Siraj: డీఎస్పీ మహ్మద్ సిరాజ్.. రిపోర్టింగ్ ఆన్ డ్యూటీ..!

|

Oct 12, 2024 | 5:38 PM

టీమిండియా పేసర్ సిరాజ్ శనివారం తెలంగాణ డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ డీజీపీ జితేందర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) కార్యాలయంలో సిరాజ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.

Mohammed Siraj: డీఎస్పీ మహ్మద్ సిరాజ్.. రిపోర్టింగ్ ఆన్ డ్యూటీ..!
Siraj Take Charge As Dsp
Follow us on

టీమిండియా పేసర్ సిరాజ్ శనివారం తెలంగాణ డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ డీజీపీ జితేందర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) కార్యాలయంలో సిరాజ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. బార్బడోస్‌లో భారత్ టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని సిరాజ్‌ కలిసినప్పుడు ఆయన సిరాజ్‌కు రెసిడెన్షియల్ ప్లాట్ మరియు ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుత ప్రతిభ కనబర్చిన సిరాజ్‌ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో, సిరాజ్ సాధించిన విజయాలు, టీమిండియా ప్రపంచ కప్ విజయంలో అతని పాత్రను ముఖ్యమంత్రి హైలైట్ చేశారు. సిరాజ్‌కు గ్రూప్-1 ఉద్యోగం లేదా పోలీసు దళంలో చేరాలని నిర్ణయించుకుంటే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వంటి ఉన్నత శ్రేణి స్థానాల్లో నేరుగా ప్రవేశం పొందవచ్చని తెలిపారు.

గ్రూప్-I ఉద్యోగం కోసం సిరాజ్ విద్యార్హతలను అందుకోనప్పటికీ, క్రీడాకారులను ప్రోత్సహించడాని అతనికి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. గ్రూప్-1 ఉద్యోగానికి కావాల్సిన విద్యార్హత డిగ్రీ అని, సిరాజ్ ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణుడయ్యాడని, అయితే అతనికి గ్రూప్-1 ఉద్యోగం కల్పించేందుకు మినహాయింపు ఇచ్చామని సీఎం చెప్పారు. గత నెలలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో సిరాజ్ చివరిసారిగా కనిపించాడు. అక్కడ అతను నాలుగు వికెట్లు పడగొట్టి భారత్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేయడంలో సహాయం చేశాడు. భారత్ తరఫున ఇప్పటివరకు 89 ఫార్మాట్లలో ఆడిన మహ్మద్ సిరాజ్ 27.57 సగటుతో 163 ​​వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి