
Mohammed Shami: గురువారం దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్‌లో మహ్మద్ షమీ 200 వన్డే అంతర్జాతీయ వికెట్లు తీసి అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. దీంతో అత్యంత వేగవంతమైన భారత బౌలర్‌గా నిలిచాడు. తన 103వ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసి షమీ ఈ మైలురాయిని చేరుకున్నాడు. 133 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని చేరుకున్న అజిత్ అగార్కర్ రికార్డును అధిగమించాడు.
34 ఏళ్ల అతను వన్డేల్లో 200 వికెట్లు తీసిన రెండవ అత్యంత వేగవంతమైన బౌలర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ (102 ఇన్నింగ్స్‌లు) తర్వాత షమీ ఈ అరుదైన రికార్డ్ తన పేరిట లిఖించుకున్నాడు.
వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్లు..
1) మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) – 102 ఇన్నింగ్స్‌లు
2) మహ్మద్ షమీ (IND) – 103 ఇన్నింగ్స్‌లు
3) సక్లైన్ ముస్తాక్ (PAK) – 104 ఇన్నింగ్స్‌లు
4) ట్రెంట్ బౌల్ట్ (NZ) – 107 ఇన్నింగ్స్‌లు
5) బ్రెట్ లీ (AUS) – 112 ఇన్నింగ్స్‌లు.
There’s the breakthrough! ⚡️
Mohd. Shami breaks the partnership as Virat Kohli takes his second catch of the innings 👌👌
Follow the Match ▶️ https://t.co/ggnxmdG0VK#TeamIndia | #BANvIND | #ChampionsTrophy pic.twitter.com/oMgE8B6IPt
— BCCI (@BCCI) February 20, 2025
44 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ జట్టు 6 వికెట్లకు 192 పరుగులు చేసింది. తౌహీద్ హృదయ్ క్రీజులో ఉన్నాడు. తౌహీద్ యాభై పూర్తి చేసుకున్నాడు.
జకీర్ అలీ 68 పరుగులు చేసి ఔటయ్యాడు. అతను మహమ్మద్ షమీ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో షమీ సెంచరీ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. సౌమ్య సర్కార్ (0), మెహదీ హసన్ మిరాజ్ (5 పరుగులు) లను కూడా అవుట్ చేశాడు.
షమీ కాకుండా అక్షర్ పటేల్ వరుస బంతుల్లో తంజిద్ హసన్ (25), వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ (0)లను అవుట్ చేశాడు. కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటోను హర్షిత్ రాణా పెవిలియన్‌కు పంపాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..