“గౌరవం మీ చేతుల్లోనే”: రోహిత్, గంభీర్‌ల పోస్ట్-మ్యాచ్ సీన్‌పై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు

Rohit Sharma: సమకాలీన క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లుగా ఉన్నప్పటికీ, కెరీర్ ముగింపు దశలో మళ్లీ కొత్త ఆటగాడిలాగే తమ స్థానాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితికి రోహిత్, విరాట్ చేరుకున్నారని మొహమ్మద్ కైఫ్ వ్యాఖ్యానించారు. వారి ప్రదర్శనే వారికి నిజమైన గౌరవాన్ని, జట్టులో స్థానాన్ని ఇస్తుందని ఆయన నొక్కి చెప్పారు.

“గౌరవం మీ చేతుల్లోనే”: రోహిత్, గంభీర్‌ల పోస్ట్-మ్యాచ్ సీన్‌పై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
Rohit Sharma

Updated on: Oct 26, 2025 | 5:28 PM

Team India: భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల కెరీర్ చరమాంకంలో నిలబడ్డారు. పరుగులు చేస్తేనే జట్టులో స్థానం ఉంటుందని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఈ ఇద్దరు తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయారు. దీంతో అందరి అంచనాలను పటాపంచలు చేశారు. ఈ క్రమంలో మొహమ్మద్ కైఫ్‌ ఆసక్తి వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే తర్వాత చోటు చేసుకున్న ఓ సన్నివేశాన్ని విశ్లేషిస్తూ, “గౌరవం మన చేతుల్లోనే” అంటూ చెప్పుకొచ్చాడు.

ఆ సన్నివేశం ఏంటంటే?

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి రిలీవ్ అయిన తర్వాత, కేవలం బ్యాటర్‌గా రోహిత్ శర్మ అద్భుతంగా రాణించి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను గెలుచుకున్నాడు. సిరీస్‌లో అత్యధిక పరుగులు (202 పరుగులు, సగటు 101) చేసిన ఆటగాడిగా నిలిచారు.

పోస్ట్-మ్యాచ్ ప్రెజెంటేషన్ అనంతరం స్టేడియంలో చోటు చేసుకున్న దృశ్యాన్ని కైఫ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో వివరించారు. “విరాట్ కోహ్లీ అప్పుడు ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. రోహిత్ శర్మ కూడా, తన రెండు ట్రోఫీలతో, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పక్కనుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వారు నవ్వులను మార్చుకుని ఉండేవారేమో, కానీ రోహిత్ మాత్రం గంభీర్‌ను దాటి వెళ్లిపోయాడు.”

ఇవి కూడా చదవండి

“గౌరవం మన చేతుల్లోనే” అంటే?

ఈ మొత్తం పరిస్థితిని విశ్లేషించిన కైఫ్, రోహిత్, విరాట్ ఇద్దరూ ఒక విషయాన్ని గ్రహించారని తెలిపారు. అదేమిటంటే, వారి ‘గౌరవం’ వారి సొంత చేతుల్లోనే ఉంది. వారు బ్యాట్‌తో పరుగులను సాధిస్తేనే, జట్టులో వారి సమయం కొనసాగుతుంది.

“గౌరవం తమ చేతుల్లోనే ఉందని వారు నిర్ణయించుకున్నారని ఇప్పుడు స్పష్టమైంది. నేను పరుగులు చేస్తేనే ఆడతాను. కొత్త ఆటగాడిగా ఉన్నప్పుడు, మీకు ఎవరూ మద్దతు ఇవ్వరని, జట్టులో ఉండాలంటే ప్రదర్శన చేయాలని మీకు తెలుసు. ఇప్పుడు కెరీర్ ముగింపు దశలో కూడా వారికి అదే విధానం ఉంది,” అని కైఫ్ అన్నాడు.

సమకాలీన క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లుగా ఉన్నప్పటికీ, కెరీర్ ముగింపు దశలో మళ్లీ కొత్త ఆటగాడిలాగే తమ స్థానాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితికి రోహిత్, విరాట్ చేరుకున్నారని మొహమ్మద్ కైఫ్ వ్యాఖ్యానించారు. వారి ప్రదర్శనే వారికి నిజమైన గౌరవాన్ని, జట్టులో స్థానాన్ని ఇస్తుందని ఆయన నొక్కి చెప్పారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..