జనగామ జిల్లా చిన్నపెండ్యాల గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో 3 అడుగుల ఎత్తు ఉన్న స్వతంత్ర అభ్యర్థి తిరుపతమ్మ సంచలన విజయం సాధించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులను ఓడించి, 812 ఓట్ల భారీ ఆధిక్యంతో ఆమె గెలుపొందారు. తిరుపతమ్మ గెలుపు రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటూ, ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.