Sunrisers Hyderabad IPL Auction: IPL 2021 వేలానికి సంబంధించి టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం జరిగిన వేలం నేపథ్యంలో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టులో ఒక్క హైదరాబాద్ క్రికెటర్ కూడా లేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆయన కామెంట్ చేశారు. కాగా, నిన్న ఐపీఎల్ 2021 మినీ ఆక్షన్ ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 292 ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా.. 57 మంది ప్లేయర్స్‌ను ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నారు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ విషయానికి వస్తే.. ఈ వేలంలో ఈ జట్టు కేవలం ముగ్గురు ఆటగాళ్లనే సొంతం చేసుకుంది. అదీ కూడా అనూహ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ కేదార్ జాదవ్‌ను దక్కించుకోవడం విశేషం.
సన్‌రైజర్స్ హైదరాబాద్(జట్టు) ప్లేయర్ల విషయానికొస్తే, డేవిడ్ వార్నర్ (కెప్టెన్), బెయిర్‌స్టో, విలియమ్సన్, మనీష్ పాండే, ప్రియం గార్గ్, విజయ్ శంకర్, జాసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, మిచెల్ మార్ష్, రషీద్ ఖాన్, అబిషేక్ శర్మ, నబీ, సాహా, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, నదీమ్, గోస్వామి, ఖలీల్ అహ్మద్, బసిల్ తంపి, విరాట్ సింగ్ ఉన్నారు. కొత్తగా టీమ్‌లోకి వచ్చిన ఆటగాళ్లు: సుచిత్, కేదార్ జాదవ్, ముజీబ్ రెహమాన్.
Very disappointed not to see a single player from Hyderabad in the Hyderabad Sunrisers Team #IPLAuction @SunRisers @IPL
— Mohammed Azharuddin (@azharflicks) February 18, 2021
Read also : Chalasani Srinivas Daughter : ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కూతురు శిరీష్మ ఆత్మహత్య