WPL 2023: ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్.. 26న ఢిల్లీతో ట్రోఫీ పోరు.. చిత్తుగా ఓడిన యూపీ వారియర్స్..

MIW vs UPW: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ముంబై ఇండియన్స్ ఫైనల్స్‌కు చేరుకుంది. ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ జట్టు ఏకపక్షంగా 72 పరుగుల తేడాతో విజయం సాధించింది.

WPL 2023: ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్.. 26న ఢిల్లీతో ట్రోఫీ పోరు.. చిత్తుగా ఓడిన యూపీ వారియర్స్..
Wpl Final 2023

Updated on: Mar 24, 2023 | 10:57 PM

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ముంబై ఇండియన్స్ ఫైనల్స్‌కు చేరుకుంది. ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ జట్టు ఏకపక్షంగా 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబైకి చెందిన ఇసాబెల్ వాంగ్ టోర్నీలో తొలి హ్యాట్రిక్ సాధించింది. అదే సమయంలో నటాలీ సీవర్ మొదట బ్యాటింగ్, బౌలింగ్‌తో మంచి ప్రదర్శన చేయడం ద్వారా తన జట్టుకు విజయాన్ని అందించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 4 వికెట్లకు 182 పరుగులు చేసింది. జవాబుగా యూపీ జట్టు 17.4 ఓవర్లలో 110 పరుగులకే ఆలౌటైంది.

నటాలీ సీవర్ తొలి ఇన్నింగ్స్‌లో అజేయంగా 72 పరుగులతో ఆకట్టుకుంది. ముంబైకి చెందిన నటాలీ సీవర్ 38 బంతుల్లో 72 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడింది. ఈ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు కూడా బాదింది. ఆ తర్వాత బౌలింగ్‌లో గ్రేస్ హారిస్ కీలక వికెట్ కూడా తీసింది.

డబ్ల్యూపీఎల్‌లో తొలి హ్యాట్రిక్..

ముంబైకి చెందిన వాంగ్ ఇజాబెల్లె వాంగ్ పేరిట WPL మొదటి హ్యాట్రిక్ నమోదైంది. 13వ ఓవర్ రెండో బంతికి కిరణ్ నవగిరే, ఆ తర్వాత మూడో బంతికి సిమ్రాన్ షేక్, నాలుగో బంతికి సోఫీ ఎక్లెస్టోన్ బౌల్డ్ అయ్యారు. పవర్‌ప్లేలో వాంగ్ అలిస్సా హీలీని పెవిలియన్‌కు పంపింది. 4 ఓవర్లలో 15 పరుగులిచ్చి 4 వికెట్లతో తన స్పెల్ ముగించింది.

వాంగ్‌తో పాటు నటాలీ సీవర్ బ్రంట్, జింటిమణి కలితా, హేలీ మాథ్యూస్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..