AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AUS vs BAN: గాయపడిన సింహం వేటకు బంగ్లా బలి.. 64 పరుగులకే మడతపెట్టేశారు

AUS vs BAN: ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ టెస్టు క్రికెట్ చరిత్రలోనే అపూర్వమైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో మ్యాచ్ తొలి ఓవర్లోనే వికెట్ పడగొట్టి, టెస్టుల్లో అత్యధిక సార్లు ఈ ఘనత సాధించిన బౌలర్‌గా జేమ్స్ ఎండర్సన్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు.

AUS vs BAN: గాయపడిన సింహం వేటకు బంగ్లా బలి.. 64 పరుగులకే మడతపెట్టేశారు
Mitchell Starc
Rakesh
|

Updated on: Aug 22, 2026 | 10:40 AM

Share

AUS vs BAN: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ మైండ్ బ్లాకింగ్ బౌలింగ్‌తో విరుచుకుపడ్డాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ప్రారంభించగానే మ్యాచ్‌లోని అతి మొదటి బంతికే ఓపెనర్ షాద్మాన్ ఇస్లామ్‌ను ప్లాటినం డక్‌గా పెవిలియన్‌కు పంపి స్టార్క్ తన రికార్డుల వేటను మొదలుపెట్టాడు. టెస్టు మ్యాచ్‌లోని తొలి ఓవర్లోనే వికెట్ తీయడం స్టార్క్ కెరీర్లో ఇది తొమ్మిదోసారి కావడం విశేషం. దీనితో ఎనిమిది సార్లు ఈ ఘనత సాధించిన ఇంగ్లండ్ దిగ్గజం జేమ్స్ ఎండర్సన్ పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డును స్టార్క్ అధిగమించాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం రే లిండ్వాల్, న్యూజిలాండ్ గ్రేట్ రిచర్డ్ హాడ్లీ, భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ తలో ఏడుసార్లు తొలి ఓవర్లోనే వికెట్లు పడగొట్టి సంయుక్తంగా తర్వాత స్థానాల్లో ఉన్నారు.

42 నిమిషాల్లోనే 5 వికెట్లతో విధ్వంసం

రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో స్టార్క్ బౌలింగ్ దాటికి బంగ్లాదేశ్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కుప్పకూలింది. తను వేసిన మొదటి ఓవర్లోనే వికెట్ తీసిన స్టార్క్, ఆ తర్వాతి ఓవర్లోనే వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి ప్రత్యర్థికి కోలుకోలేని షాక్ ఇచ్చాడు. మొదటి మ్యాచ్‌లో సెంచరీ చేసిన తంజీద్ హసన్‌ను, ఆ వెంటనే కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటోను గోల్డెన్ డక్‌గా అవుట్ చేశాడు. ఆ తర్వాత మోమినుల్ హక్, లిటన్ దాస్‌లను తన వెంటవెంటే సాగనంపాడు. కేవలం 22 బంతుల వ్యవధిలో, 42 నిమిషాల వ్యవధిలోనే 5 వికెట్ల మైలురాయిని అందుకోవడం విశేషం. బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్‌లోని ఐదుగురిలో ఏకంగా నలుగురు ఆటగాళ్లు అసలు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరడం స్టార్క్ బౌలింగ్ తీవ్రతకు నిదర్శనం.

ఇది కూడా  చదవండి: IND vs AFG: ఒకే సమయంలో రెండు లీగ్‌లు.. అభిషేక్ శర్మ, శుభ్‎మన్ గిల్‌కు ఊహించని చిక్కులు

64 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్

స్టార్క్ నిప్పులు చెరిగే బంతులకు మిగతా బౌలర్లు కూడా తోడవడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ తీవ్ర నిరాశ పరిచింది. మొత్తం 10 ఓవర్లు వేసిన స్టార్క్ అందులో 6 ఓవర్లు మేడెన్ చేసి, కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఆఖరి వికెట్‌గా షోరిఫుల్ ఇస్లామ్‌ను అవుట్ చేసి బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. స్టాక్‌తో పాటు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 3 వికెట్లు, జోష్ హేజెల్‌వుడ్ ఒక వికెట్ తీయడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 64 పరుగులకే ఆలౌట్ అయింది. అతి తక్కువ స్కోరుకే ప్రత్యర్థిని కట్టడి చేసిన ఆస్ట్రేలియా, ఈ మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది.

ఇది కూడా చదవండి: Mitchell Starc: వీడు మగాడ్రా బుజ్జి.. 42 నిమిషాల్లో 22 బంతులు వేసి 5 వికెట్లు.. ఇది ఆల్ టైమ్ రికార్డ్

స్టార్క్ ధాటికి బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోవడంతో ఆస్ట్రేలియా మ్యాచ్‌పై పట్టు బిగించింది. తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనతో సరికొత్త రికార్డు సృష్టించిన స్టార్క్, ఆధునిక టెస్ట్ క్రికెట్‌లో బెస్ట్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌గా తన స్థానాన్ని మరోసారి సుస్థిరం చేసుకున్నాడు.

 ఇది కూడా చదవండి: Love Affairs: ఆటగాడు మామూలు ఆటగాడు కాదు.. పాక్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌తో బాలీవుడ్ భామల అఫైర్లు

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us