మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల క్రికెట్‌పై కన్నేశాడు. అమెరికాలో వచ్చే ఏడాది నుంచి ప్రారంభించే మేజర్ లీగ్ క్రికెట్(MLC)లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నాడు. ఈమేరకు ఇప్పటికే మేజర్ లీగ్ సాకర్, ఫ్రాంచైజీ సీటెల్ సౌండర్స్ పార్ట్ సహ యజమానిగా ఉన్న సత్య నాదెళ్ల ఇన్వెస్టర్ల నుంచి 44 మిలియన్ డాలర్ల పెట్టుబడి కూడా సేకరించారు. ఇందులో ఆయనే కీలకంగా పెట్టుబడులు పెట్టారు. టీ20 తరహాలో ఈ మేజర్ లీగ్ క్రికెట్‌ను నిర్వహించనున్నారు. ఈమేరకు ప్రపంచ క్రికెట్‌లో కీలక మార్పులు జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మేజర్ లీగ్ క్రికెట్ కోసం మొత్తం 120 మిలియన్ డాలర్లు సమకూర్చేందుకు టార్గెట్‌గా అనుకున్నారు.
కాగా, ఇప్పటికే 44 మిలియన్డాలర్లు ఏర్పాటు చేశారు. మరో 12 నెలల్లో మిగిలిన 76 మిలియన్లను సమకూర్చుకునేందుకు భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. మేజర్ లీగ్ క్రికెట్ టీ20 లీగ్‌లో తలపడే జట్ల సంఖ్యను 6 ప్రాంఛైజీలుగా నిర్ణయించారు. ఇప్పటికే అమెరికా క్రికెట్ నుంచి అనుమతులు కూడా తీసుకున్నారు. అమెరికాలో క్రికెట్‌కు ఆదరణ పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల నుంచి సమకూర్చిన సొమ్ముతో అమెరికాలో భారీ స్టేడియాలు ఏర్పాటు చేయనున్నారు. అమెరికాలో టోర్నీని సక్సెస్ చేయడంతోపాటు, క్రికెట్‌కు నిలయంగా అమెరికాను మార్చాలనుకుంటున్నారు. మెగా లీగ్ క్రికెట్ ఇన్వెస్టర్లలో సత్య నాదెళ్లతోపాటు వెంకీ హరినారాయణ్(మిల్లివేస్ వెంచర్స్ అండ్ రాకెట్‌షిప్ వీసిలో సహ వ్యవస్థాపకులు), ఆనంద్ రాజరామన్, మడ్రోనా వెంచర్ గ్రూప్ఎండీ సోమ సోమసెగార్, సంజయ్ గోవిల్(ఇన్ఫినైట్ కంప్యూటర్ సోల్యూషన్స్వ్యవస్థాపకులు), తన్వీర్ అహ్మద్, అనురాగ్ జైన్, బహెటి ఫ్యామిలీ లాంటి ప్రముఖులు కూడా భాగమయ్యారు.
ఐపీఎల్‌పైనా కన్నేస్తారా..
భారతదేశంలో నిర్వహించేఇండియన్ ప్రీమియర్ లీగ్, ఆస్ట్రేలియాలో నిర్వహించే బిగ్‌బాష్ లీగ్‌కు అద్భుత స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే పలు దేశాలు కూడా ప్రత్యేక లీగ్‌లతో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నాయి. మేజర్ లీగ్ క్రికెట్‌లో పెట్టుబడులు పెట్టడంతో ఐపీఎల్‌లోనూ ఇన్వెస్ట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: Watch Video: ఇదేందిరయ్యా ఇలా జరిగింది.. తలపట్టుకున్న రషీద్ ఖాన్.. సంతోషంలో మాక్స్‌వెల్.. ఎందుకంటే?