MI vs PBKS: వామ్మో.. ఇదేం ఉతుకుడు సామీ.. దంచి కొట్టిన పంజాబ్ బ్యాటర్స్.. ముంబై ముందు భారీ టార్గెట్..
Mumbai Indians vs Punjab Kings: పంజాబ్ ఆటగాళ్లు సామ్ కరణ్, హర్‌ప్రీత్ సింగ్, జితేష్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్‌తో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ టీం 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్ ముందు 215 పరుగుల టార్గెట్ నిలిచింది.
ముంబై బౌలర్లలో పీయూష్ చావ్లా, కెమెరూన్ గ్రీన్ తలో 2 వికెట్లు తీశారు. ఈ సీజన్‌లో అత్యంత ఖరీదైన ఓవర్ బౌలర్ రికార్డును అర్జున్ టెండూల్కర్ సమం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 16వ ఓవర్లో 31 పరుగులు ఇచ్చాడు. జితేష్ శర్మ 7 బంతుల్లో 25 పరుగులు చేయడంతో పంజాబ్ చివరి 5 ఓవర్లలో 96 పరుగులు పిండుకుంది.
అత్యంత ఖరీదైన బౌలర్‌గా అర్జున్ టెండూల్కర్..
పంజాబ్‌పై ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యంత ఖరీదైన ఓవర్ బౌలింగ్ చేశాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో 31 పరుగులు ఇచ్చాడు. ఈ ఓవర్‌లో సామ్ కరణ్, హర్‌ప్రీత్ భాటియా 2 సిక్సర్లు, 4 ఫోర్లు బాదారు. అంతకు ముందు గుజరాత్ టైటాన్స్‌కు చెందిన యశ్ దయాల్ కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఒక ఓవర్‌లో 31 పరుగులు ఇచ్చాడు.
కేమెరాన్ గ్రీన్ కూడా ఇన్నింగ్స్ 18వ ఓవర్లో 25 పరుగులు ఇచ్చాడు. అతని ఓవర్‌లో సామ్ కరణ్, జితేష్ శర్మ తలో 2 సిక్సర్లు బాదారు. ఈ ఓవర్‌లో హర్‌ప్రీత్ భాటియా వికెట్ కూడా పడింది.
It’s raining sixes in Mumbai ?️
Half-century comes up for @PunjabKingsIPL skipper @CurranSM ??#PBKS nearing the 200-run mark now!
Follow the match ▶️ https://t.co/FfkwVPpj3s #TATAIPL | #MIvPBKS pic.twitter.com/8ma8iLaP9v
— IndianPremierLeague (@IPL) April 22, 2023
పవర్‌ప్లేలో..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ మూడో ఓవర్‌లో మాథ్యూ షార్ట్ వికెట్ కోల్పోయింది. అయితే తొలి వికెట్ తర్వాత ప్రభ్‌సిమ్రాన్ సింగ్, అథర్వ తైడే జట్టును ఆదుకున్నారు. పవర్‌ప్లేలో ఇద్దరూ జట్టు స్కోర్‌ను ఒక వికెట్‌కు 58 పరుగులు చేశారు.
ఇరు జట్లు:
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): అథర్వ తైడే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, మాథ్యూ షార్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్(కెప్టెన్), జితేష్ శర్మ(కీపర్), హర్‌ప్రీత్ సింగ్ భాటియా, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.
పంజాబ్ కింగ్స్ సబ్స్: నాథన్ ఎల్లిస్, మోహిత్ రాథీ, సికందర్ రజా, రిషి ధావన్, గుర్నూర్ బ్రార్.
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..