MI vs DC Highlights, IPL 2022: థ్రిల్లింగ్ విక్టరీ.. అక్షర్ పటేల్, లలిత్ యాదవ్‌ల అద్భుత ఇన్నింగ్స్‌.. 4 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయ ఢంకా..

Venkata Chari

|

Updated on: Mar 27, 2022 | 7:40 PM

Mumbai Indians vs Delhi Capitals Highlights in Telugu: ముంబై ఇచ్చిన 178 పరుగుల టార్గెట్‌ను.. ఢిల్లీ క్యాపిటల్స్ టీం 6 వికెట్లు కోల్పోయి మరో 11 బంతులు ఉండగానే విజయం సాధించింది.

MI vs DC Highlights, IPL 2022: థ్రిల్లింగ్ విక్టరీ.. అక్షర్ పటేల్, లలిత్ యాదవ్‌ల అద్భుత ఇన్నింగ్స్‌.. 4 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయ ఢంకా..
Ipl 2022 Dc Vs Mi

ఈరోజు ఐపీఎల్‌లో సండేలో భాగంగా తొలి మ్యాచ్‌లో బ్రాబోర్న్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. ముంబై ఇచ్చిన 178 పరుగుల టార్గెట్‌ను.. ఢిల్లీ క్యాపిటల్స్ టీం 6 వికెట్లు కోల్పోయి మరో 11 బంతులు ఉండగానే విజయం సాధించింది. వరుసగా వికెట్లు కోల్పోయి ఓడిపోతారనుకున్న మ్యాచ్‌ను అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ పూర్తిగా మార్చేశారు. వీరిద్దరూ 75 పరుగుల భాగస్వామ్యంతో ఢిల్లీని విజయతీరాలకు చేర్చారు. అక్షర్ పటేల్ కేవలం 17 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సులతో 38 పరుగులు, లలిత్ యాదవ్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 48 పరుగులు సాధించి, ముంబై బౌలర్లకు చుక్కలు చూపించారు. ఢిల్లీ బ్యాటర్లలో షా 38, టిమ్ 21, మన్దీప్ 0, రిషబ్ పంత్ 1, లలిత్ యాదవ్ 35, పొవెల్ 0, శార్దుల్ 22, అక్షర్ పటేల్ 16 పరుగులు చేశారు. మురుగన్ అశ్విన్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. దీని తర్వాత థంపి కూడా ఒకే ఓవర్‌లో 2 వికెట్లు తీసి ఢిల్లీని వెన్నుపోటు పొడిచాడు. అంతకు ముందు ముంబై ఇండియన్ టీం నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 177 పరుగులు పూర్తి చేసింది. ఇషాన్ కిషన్ 81 పరగులతో అజేయంగా నిలిచాడు. రోహిత్ శర్మ 41, తిలక్ వర్మ 22, సింగ్ 8, పొలార్డ్ 3, టిమ్ డేవిడ్ 12 పరుగులు చేశారు. టాస్ గెలిచిన ఢిల్లీ టీం బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై టీం తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ఓపెనర్లు రోహిత్, ఇషాన్ తుఫాన్ ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చైనామన్ కుల్దీప్ ఢిల్లీ టీంకు బ్రేక్ త్రూ అందించాడు. సుదీర్ఘ ఇన్నింగ్స్ వైపు కదులుతున్న సమయంలో రోహిత్‌ను స్పిన్‌తో పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత మరో 2 వికెట్లు తీశాడు. ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పృథ్వీ షా, టిమ్ సీఫెర్ట్, మన్‌దీప్ సింగ్, రిషబ్ పంత్(కీపర్/కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, కమలేష్ నాగర్‌కోటి

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), తిలక్ వర్మ, అన్మోల్‌ప్రీత్ సింగ్, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, టైమల్ మిల్స్, జస్ప్రీత్ బుమ్రా, బాసిల్ థంపి

Key Events

ముంబయిదే పైచేయి

ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 30 మ్యాచ్‌లు జరిగాయి. ముంబై ఇండియన్స్16, ఢిల్లీ క్యాపిటల్స్ 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి.

ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్

ఇషాన్ కిషన్ తొలి మ్యాచ్‌లోనే తుఫాన్ ఇన్నింగ్స్ ఆడి అజేయంగా 81 పరుగులతో నిలిచాడు.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 27 Mar 2022 07:21 PM (IST)

    ఢిల్లీ @ థ్రిల్లింగ్ విక్టరీ..

    ముంబై ఇచ్చిన 178 పరుగుల టార్గెట్‌ను.. ఢిల్లీ క్యాపిటల్స్ టీం 6 వికెట్లు కోల్పోయి మరో 11 బంతులు ఉండగానే విజయం సాధించింది.

  • 27 Mar 2022 07:13 PM (IST)

    17 ఓవర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్..

    17 ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. లలిత్ యాదవ్ 36, అక్షర్ పటేల్ 21 పరుగుతో క్రీజులో ఉన్నారు.

  • 27 Mar 2022 06:30 PM (IST)

    10 ఓవర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్..

    10 ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. లలిత్ యాదవ్ 11, శార్దుల్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

  • 27 Mar 2022 05:58 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ..

    రిషబ్ పంత్(0) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం మూడో వికెట్ కోల్పోయింది. మిల్స్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడిన పంత్.. టిమ్ డేవిడ్ చేతికి చిక్కాడు. 32 పరుగుల వద్ద ఢిల్లీ టీం మూడో వికెట్‌ను కోల్పోయింది.

  • 27 Mar 2022 05:52 PM (IST)

    వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ..

    టిమ్ సీఫెర్ట్(21), మనుదీప్(0) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. ఎం. అశ్విన్ బౌలింగ్‌తో ముంబై టీంకు బిగ్ బ్రేక్ త్రూ అందించాడు. ప్రస్తుతం 4 ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ టీం 2 వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది.

  • 27 Mar 2022 05:44 PM (IST)

    3 ఓవర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్..

    3 ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. పృథ్వీ షా 7, టిమ్ సీఫెర్ట్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు. వికెట్ల కోసం ముంబై బౌలర్లు తెగ కష్టపడుతున్నారు.

  • 27 Mar 2022 05:21 PM (IST)

    ఢిల్లీ టార్గెట్ 178

    నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబయి ఇండియన్స్ టీం 5 వికెట్లు కోల్పోయి 177 పరుగులు పూర్తి చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 178 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. ఇషాన్ కిషన్ 81 పరగులతో అజేయంగా నిలిచాడు.

  • 27 Mar 2022 04:56 PM (IST)

    ఇషాన్ హాఫ్ సెంచరీ..

    ముంబయి ఓపెనర్ ఇషాన్ శర్మ 34 బంతుల్లో తన అర్థసెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. ప్రస్తుతం ఇషాన్ 160 పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధిస్తున్నాడు. ప్రస్తుతం 16.5 ఓవర్లకు ముంబై టీం 4 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది.

  • 27 Mar 2022 04:53 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై..

    కీరన్ పొలార్డ్(3) నాలుగో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి షీఫెర్డ్ చేతికి చిక్కాడు. దీంతో 122 పరుగుల వద్ద ముంబయి టీం నాలుగో వికెట్‌ను కోల్పోయింది.

  • 27 Mar 2022 04:43 PM (IST)

    మూడో వికెట్ డౌన్..

    తిలక్ వర్మ(22) మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఖలీల్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి షా చేతికి చిక్కాడు. దీంతో 117 పరుగుల వద్ద ముంబయి టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. ఇషాంత్ 45 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.

  • 27 Mar 2022 04:37 PM (IST)

    13 ఓవర్లకు ముంబయి స్కోర్..

    13 ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబయి ఇండియన్స్ 2 వికెట్లు నష్టపోయి 104 పరుగులు చేసింది. ఇషాన్ 40(27 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్స్), తిలక్ వర్మ14 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 27 Mar 2022 04:25 PM (IST)

    రెండో వికెట్ డౌన్..

    అన్మోల్(8) రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి లలిత్ యాదవ్ చేతికి చిక్కాడు. దీంతో 83 పరుగుల వద్ద ముంబయి టీం రెండో వికెట్‌ను కోల్పోయింది.

  • 27 Mar 2022 04:16 PM (IST)

    రోహిత్ ఔట్..

    ఎట్టకేలకు ఢిల్లీ టీం బౌలర్లు కీలక వికెట్‌ను దక్కించుకున్నారు. ధాటిగా ఆడుతోన్న ముంబై సారథి రోహిత్ శర్మ(41 పరుగులు, 32 బంతులు, 4 ఫోర్లు, 2 సిక్సులు)ను కుల్దీప్ యాదవ్ పెవిలియన్ చేర్చాడు. భారీ షాట్ క్రమంలో రోహిత్ శర్మ.. పోవెల్ చేతికి చిక్కాడు. దీంతో 67 పరుగుల వద్ద ముంబయి టీం తొలి వికెట్‌ను కోల్పోయింది.

  • 27 Mar 2022 04:02 PM (IST)

    50 పరుగులు దాటిన ముంబై స్కోర్..

    6 ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. ధాటిగా ఆడుతోన్న రోహిత్, ఇషాన్ కేవలం 36 బంతుల్లోనే స్కోర్‌ను అర్థసెంచరీ దాటించారు. ఇందులో 6 ఫోర్లు, 3 సిక్సులు బాదేశారు. రోహిత్ 30(23 బంతులు, 3 ఫోర్లు, 2 సిక్సులు), ఇషాన్ 22(13 బంతులు, 3 ఫోర్లు, 1 సిక్స్) పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 27 Mar 2022 03:55 PM (IST)

    5 ఓవర్లకు ముంబయి స్కోర్..

    5 ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబయి ఇండియన్స్ వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. రోహిత్ 25(17 బంతులు, 2 ఫోర్లు, 2 సిక్సులు), ఇషాన్ 22(13 బంతులు, 3 ఫోర్లు, 1 సిక్స్) పరుగులతో ఢిల్లీ బౌలర్లను చెడుగుడు ఆడుకుంటున్నారు.

  • 27 Mar 2022 03:44 PM (IST)

    3 ఓవర్లకు ముంబయి స్కోర్..

    3 ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబయి ఇండియన్స్ టీం వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. రోహిత్ 13, ఇషాన్ 12 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 27 Mar 2022 03:07 PM (IST)

    ముంబయి ప్లేయింగ్ ఎలెవన్..

    ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), తిలక్ వర్మ, అన్మోల్‌ప్రీత్ సింగ్, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, టైమల్ మిల్స్, జస్ప్రీత్ బుమ్రా, బాసిల్ థంపి

  • 27 Mar 2022 03:06 PM (IST)

    ఢిల్లీ ప్లేయింగ్ ఎలెవన్

    ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పృథ్వీ షా, టిమ్ సీఫెర్ట్, మన్‌దీప్ సింగ్, రిషబ్ పంత్(కీపర్/కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, కమలేష్ నాగర్‌కోటి

  • 27 Mar 2022 03:04 PM (IST)

    ముంబయి క్యాప్‌లు అందుకున్న ఐదుగురు..

    తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, ఎం. అశ్విన్, రిలే మెరెడిత్, టైమల్ మిల్స్‌లకు ముంబై క్యాప్‌లను అందజేసింది. వీరు ఈ ఏడాది ముంబై టీంతో ఆడనున్నారు.

  • 27 Mar 2022 03:03 PM (IST)

    టాస్ గెలిచిన ఢిల్లీ.. ముంబయి బ్యాటింగ్..

    ఐపీఎల్ 2022లో భాగంగా నేడు జరగనున్న డబుల్ హెడర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం టాస్ గెలిచింది. దీంతో ముంబయి టీం తొలుత బ్యాటింగ్ చేయనుంది.

  • 27 Mar 2022 02:56 PM (IST)

    మైదానంలోకి సచిన్ టెండూల్కర్ ఎంట్రీ..

    ముంబై ఇండియన్స్ స్పిన్నర్ మురుగన్ అశ్విన్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు ముందు సచిన్ టెండూల్కర్ నుంచి ప్రత్యేక చిట్కాలు తీసుకోవడం కనిపించింది. సచిన్ ముంబై జట్టు మెంటార్ పాత్రలో ఉన్నాడు. ఇంతకు ముందు ఈ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.

  • 27 Mar 2022 02:55 PM (IST)

    DC vs MI హెడ్ టు హెడ్: ముంబైదే పైచేయి..

    ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లను పరిశీలిస్తే.. ముంబైదే పైచేయిగా కనిపిస్తోంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 30 మ్యాచ్‌లు జరిగాయి. ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 16 విజయాలు సాధించింది. అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

  • 27 Mar 2022 02:48 PM (IST)

    DC vs MI, IPL 2022: బ్రబౌర్న్ స్టేడియంలో తలపడనున్న ముంబై, ఢిల్లీ..

    ఐపీఎల్ 2022 రెండో మ్యాచ్‌ బ్రబౌర్న్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగుతోంది. చాలా కాలం తర్వాత ఈ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మైదానం క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా పరిధిలోకి వస్తుంది. వాంఖడే స్టేడియం కంటే ముందు ఈ మైదానంలో అనేక అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి.

Published On - Mar 27,2022 2:46 PM

Follow us
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..