
Mumbai Indians Retained and Released Players Full List: గత సంవత్సరం పట్టికలో అట్టడుగున నిలిచిన తర్వాత, ముంబై ఇండియన్స్ 18వ సీజన్‌లో మరోసారి దారుణమైన ఆరంభాన్ని పొందింది. మొదటి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు ఓడిపోయి, ప్లేఆఫ్స్ రేసు నుంచి మరోసారి ముందుగానే నిష్క్రమించింది.
అయితే, ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన ఈ జట్టు, సీజన్ ప్రారంభంలో నెమ్మదిగా ప్రారంభమయ్యే జట్టుగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత వేగం పుంజుకుంటూ టైటిల్ దిశగా సాగుతుంది. 2026లోనే ఇదే జరుగుతుందని అంతా భావిస్తున్నారు. ముంబై వరుసగా ఆరు విజయాలతో 2025లోనూ అదే నిరూపించింది.
MI నిలుపుకున్న ఆటగాళ్ల జాబితా : జస్ప్రీత్ బుమ్రా (రూ.18 కోట్లు), హార్దిక్ పాండ్యా (సి) (రూ. 16.35 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ. 16.35 కోట్లు), రోహిత్ శర్మ (రూ. 16.30 కోట్లు), తిలక్ వర్మ (రూ. 8 కోట్లు), దీపక్ చాహర్ (రూ. 9.25 కోట్లు), ట్రెంట్ బౌల్ట్ (రూ. 12.5 కోట్లు), నమన్ ధీర్ (రూ. 5.25 కోట్లు), (రూ. 4.80 కోట్లు), మిచెల్ సాంట్నర్ (రూ. 2 కోట్లు), ర్యాన్ రికెల్టన్ (రూ. 1 కోటి), రాబిన్ మింజ్ (రూ. 65 లక్షలు), రాజ్ అంగద్ బావా (రూ. 30 లక్షలు), అశ్వనీ కుమార్ (రూ. 30 లక్షలు), కార్బిన్ బాష్ (రూ. 30 లక్షలు).
ముంబై ఇండియన్స్ విడుదల చేసిన ఆటగాళ్లు : అర్జున్ టెండూల్కర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 30 లక్షలకు ట్రేడ్ చేశారు. బెవన్ జాకబ్స్, కె శ్రీజిత్, విఘ్నేష్ పుత్తూర్, కర్ణ్ శర్మ, లిజార్డ్ విలియమ్స్, సత్యనారాయణ రాజు, ముజీబ్ ఉర్ రెహమాన్, రీస్ టోప్లీ.
IPL 2026 వేలం కోసం ముంబై ఇండియన్స్ (MI) మిగిలి ఉన్న బ్యాలెన్స్: రూ. 2.75 కోట్లు
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..