IPL 2025: అదంతా ఉత్తునే! WWE రేంజ్ లో ఫైట్ పై మౌనం వీడిన SRH ఓపెనర్!
ఐపీఎల్ 2025లో SRH ఓపెనర్ ట్రావిస్ హెడ్, మాక్స్‌వెల్‌తో వాగ్వాదంలో పాల్గొన్న సంఘటనకు స్పందించాడు. వరుస సిక్సర్లకు మాక్స్‌వెల్ అసహనం వ్యక్తం చేయడంతో మాటల తూటాలు ఎగురాయి. స్టోయినిస్ కూడా ఈ గొడవలో కలవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే హెడ్ మాట్లాడుతూ ఇది సరదా భాగమేనని, జట్టు విజయంతో సంతోషంగా ఉన్నామని స్పష్టం చేశాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లోని ఒక ఆసక్తికరమైన సంఘటనగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఓపెనర్ ట్రావిస్ హెడ్, పంజాబ్ కింగ్స్ (PBKS) తో జరిగిన మ్యాచ్ సందర్భంగా గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్‌తో మధ్యలో జరిగిన వాగ్వాదంపై చివరకు స్పందించాడు. ఈ సంఘటన మ్యాచ్‌లో తొమ్మిదవ ఓవర్లో చోటుచేసుకుంది. గ్లెన్ మాక్స్‌వెల్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ట్రావిస్ హెడ్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. ఇది మాక్స్‌వెల్‌ను కొంత అసహనానికి గురిచేసింది. రెండు సిక్సర్ల అనంతరం మాక్స్‌వెల్ హెడ్‌తో మతాల యుద్ధం చేసాడు. ఓవర్ ముగిశాక హెడ్ మాక్స్‌వెల్‌ను ఎదుర్కొని స్పందించడంతో, వారిద్దరి మధ్య మాటల తూటాలు చెలరేగాయి. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసిన నేపథ్యంలో ఫీల్డ్ అంపైర్ జోక్యం చేసుకుని గొడవను ఆపాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ కూడా వారి మధ్య వాగ్వాదంలో పాల్గొనడం గమనార్హం.
ఈ సంఘటనపై ట్రావిస్ హెడ్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ, “మేము ఒకరినొకరు బాగా తెలుసుకుని ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో సరదాగా ఇలా మాటలు మార్పులు జరుగుతుంటాయి. పెద్దగా సీరియస్‌గా ఏమీ లేదు,” అంటూ వివరణ ఇచ్చాడు. అనంతరం జట్టు విజయంపై స్పందిస్తూ, “విజేతల జాబితాలో చేరడం చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ గెలుపు చాలా అవసరమయ్యింది. సగం సమయంలో మా లక్ష్యం స్పష్టంగా కనిపించింది. మేము సరైన ప్రణాళికలతో బ్యాటింగ్ చేశాం, ఓపికగా ఆడి మంచి స్కోరు ఛేదించగలిగాం. మేము గత సీజన్‌కి చేసిన ప్రదర్శనల్ని ఈ సీజన్‌లోనూ కొనసాగించాలన్నదే లక్ష్యం,” అని చెప్పాడు. అలాగే, 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలంటే అన్ని అంశాలు సరిగ్గా కలసివచ్చేలా చూడాల్సిన అవసరం ఉందని వివరించాడు.
ఈ హై స్కోరింగ్ మ్యాచ్‌లో మొదటగా టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రియాంష్ ఆర్య (13 బంతుల్లో 36 పరుగులు, రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), ప్రభ్సిమ్రాన్ సింగ్ (23 బంతుల్లో 42 పరుగులు, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) మిడిలార్డర్‌కు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 36 బంతుల్లో 82 పరుగులు చేశాడు, ఇందులో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. చివర్లో మార్కస్ స్టోయినిస్ విజృంభించి 11 బంతుల్లో 34 పరుగులు సాధించాడు. మొత్తం మీద పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 245/6 స్కోరు చేసింది. SRH తరఫున హర్షల్ పటేల్ 4 వికెట్లు తీయగా, ఎషాన్ మలింగ రెండు వికెట్లు తీశాడు.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ట్రావిస్ హెడ్ (37 బంతుల్లో 66 పరుగులు), అభిషేక్ శర్మ (55 బంతుల్లో 141 పరుగులు, 14 ఫోర్లు, 10 సిక్సర్లు) అద్భుతమైన ఆరంభ భాగస్వామ్యం అందించారు. ఇద్దరూ కలిసి 171 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హెడ్ అవుట్ అయిన తర్వాత అభిషేక్ ఆటను ముందుండి నడిపించాడు. చివర్లో హెన్రిచ్ క్లాసెన్ (21 నాటౌట్), ఇషాన్ కిషన్ (9 నాటౌట్) అవసరమైన పరుగులు సాధించి జట్టును గెలుపు గీత దాటి నడిపించారు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..