Rohit Sharma: టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన కెప్టెన్సీతోపాటు తుఫాన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పేరిట భారీ బ్యాటింగ్ రికార్డులు ఉన్నాయి. ఇంతకుముందు, రోహిత్ శర్మ వన్డే, టీ20 క్రికెట్లో మాత్రమే మంచి బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచాడు. అయితే, గత 6-7 సంవత్సరాలలో, రోహిత్ శర్మ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో దూకుడుగా కనిపిస్తున్నాడు. టెస్ట్ ఓపెనర్‌గా రోహిత్ శర్మ తన స్థానాన్ని ధృవీకరించినప్పుడు, దీని కారణంగా ఓ బ్యాట్స్‌మన్ కెరీర్ పూర్తిగా నాశనమైందని మీకు తెలుసా? ఆ ఆటగాడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్లో తన ఆధిపత్యాన్ని నెలకొల్పినప్పటి నుంచి, చాలా మంది మంచి ఓపెనర్లు జట్టుకు దూరంగా ఉండవలసి వచ్చింది. ఈ ఆటగాళ్లలో వెటరన్ ఓపెనర్ మురళీ విజయ్ పేరు కూడా ఉంది. చాలా కాలం పాటు టీమిండియాకు దూరంగా ఉన్న మురళీ విజయ్ జనవరి 2023లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. మురళీ విజయ్ ఒకప్పుడు టీమిండియా అత్యుత్తమ టెస్ట్ ఓపెనర్‌గా పేరుగాంచాడు. కానీ, ఇప్పుడు అతను కొన్నేళ్లుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. మురళీ విజయ్ డిసెంబర్ 2018లో ఆస్ట్రేలియాతో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు.
మురళీ విజయ్ టెస్ట్ క్రికెట్లో మొత్తం 61 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను 3982 పరుగులు చేశాడు. అంతేకాదు అతని బ్యాట్ నుంచి 12 సెంచరీలు కూడా వచ్చాయి. వన్డే, టీ20 క్రికెట్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో రీఎంట్రీ ఇవ్వడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. విరాట్ కోహ్లి టెస్ట్ జట్టుకు నాయకత్వం వహించినప్పటి నుంచి, మురళీ విజయ్ టీమ్ ఇండియాకు ఓపెనింగ్ బాధ్యతను నిరంతరంగా తీసుకున్నాడు. అయితే రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్‌ను విడిచిపెట్టడంతోపాటు టెస్ట్‌లలో కూడా ఓపెనింగ్ చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత మురళీ విజయ్ కెరీర్ ముగింపు దిశగా సాగింది. ఇప్పుడు ఈ ఆటగాడు రిటైర్మెంట్ తీసుకున్నాడు.
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ నిలిచిన సంగతి తెలిసిందే. వన్డే, టెస్టు క్రికెట్లో భారత్‌కు రోహిత్ శర్మ కెప్టెన్. రోహిత్ శర్మ ఇప్పటివరకు భారత్ తరపున 62 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 43.65 సగటుతో 4234 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్లో రోహిత్ శర్మ పేరిట 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టు క్రికెట్లో రోహిత్ శర్మ అత్యుత్తమ స్కోరు 212 పరుగులు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..