జ్వరంతో టీమిండియా నుంచి ఔట్.. కట్ చేస్తే.. 38 పరుగులకే 7 వికెట్లతో రెచ్చిపోయిన బౌలర్.. ఎవరంటే?

Team India: మధ్యప్రదేశ్ తరపున ఆడుతున్న అవేశ్ ఖాన్ విదర్భపై 22 ఓవర్లలో 38 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. ఈ సమయంలో అతను 11 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు.

జ్వరంతో టీమిండియా నుంచి ఔట్.. కట్ చేస్తే.. 38 పరుగులకే 7 వికెట్లతో రెచ్చిపోయిన బౌలర్.. ఎవరంటే?
Avesh Khan

Updated on: Jan 05, 2023 | 8:59 PM

Avesh Khan: గతేడాది జ్వరంతో బాధపడుతూ.. టీమిండియా నుంచి దూరమయ్యాడు. ఆ తర్వాత మళ్లీ టీంలోకి ఎంట్రీ ఇవ్వలేదు. అనంతరం ఫీవర్ తగ్గి మరోసారి తన ఆటతో సత్తా చాటాడు. ఫుల్ హ్యాంగోవర్ బంతితో విధ్వంసం చేసి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. విదర్భతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో తన పేస్‌తో ప్రకంపనలు సృష్టించిన అవేష్ ఖాన్ గురించే ఇప్పుడు మాట్లాడుతన్నాం. బంతితో విధ్వంసం సృష్టించిన ఈ టీమిండియా ప్లేయర్ దెబ్బెకు.. విదర్భ టీం కోలుకోలేకపోయింది.

గత సంవత్సరం ఆసియా కప్ నుంచి జ్వరం కారణంగా జట్టు నుంచి ఔటైన అవేష్ ఖాన్.. అక్టోబరులో టీమిండియా తరపున చివరి మ్యాచ్‌ ఆడాడు. కోలుకున్నా.. ఆ తర్వాత మళ్లీ టీంలోకి రాలేకపోయాడు. అయితే ఇప్పుడు ఏకంగా ఏడుగురు బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేయడం ద్వారా మళ్లీ టీమిండియా తలుపు తట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు.

38 పరుగులకే 7 వికెట్లు..

మధ్యప్రదేశ్ తరపున ఆడుతున్న అవేశ్ ఖాన్ విదర్భపై 22 ఓవర్లలో 38 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. ఈ సమయంలో అతను 11 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అవేశ్‌కి ఇది రెండో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. 24 పరుగుల వద్ద 7 మంది బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేయడం అతని అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. అదే సమయంలో అవేష్ ఖాన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం ఇది ఆరోసారి.

ఇవి కూడా చదవండి

విదర్భ 7 వికెట్లలో 5గురు టాప్ ఆర్డర్‌వే..

విదర్భ టాప్ బ్యాట్స్‌మెన్‌లో అవేష్ ఖాన్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లలో 5 వికెట్లు టాప్ ఆర్డర్‌వే కావడం గమనార్హం. ఆ తర్వాత 9, 10 నంబర్ బ్యాట్స్‌మెన్‌ల వికెట్లు పడగొట్టాడు. అవేష్ ఖాన్ ఒంటరిగా విదర్భ వెన్ను విరిచాడు.

అవేష్ ఖాన్ అద్భుత ప్రదర్శన తర్వాత, మధ్యప్రదేశ్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 149 పరుగుల ఆధిక్యాన్ని పొందింది. ఇది మ్యాచ్‌పై తమ పట్టును బలోపేతం చేసుకోవడానికి సహాయపడింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..