Lucknow Super Giants vs Kolkata Knight Riders: శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ 98 పరుగుల భారీ తేడాతో లక్నో సూపర్ జెయింట్‌పై విజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలో లక్నోకు ఇదే అత్యంత భారీ ఓటమి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 235 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లక్నో జట్టు 16.1 ఓవర్లలో 137 పరుగులకే కుప్పుకూలింది. లక్నోలో మార్క్స్ స్టోయినిస్ 36 పరుగులతో టాప్ స్కోర్ చేశాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ 25 పరుగులు చేశాడు. అష్టన్ టర్నర్ 16, ఆయుష్ బడోని 15, నికోలస్ పూరన్ 10 పరుగులు జోడించారు. లక్నోకు చెందిన 5 మంది రెండంకెల సంఖ్యను కూడా చేరుకోలేకపోయారు. నవీన్ ఉల్ హక్ నాటౌట్ గా నిలిచాడు. కేకేఆర్ తరఫున హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి చెరో 3 వికెట్లు తీశారు. సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్ తలా ఒక వికెట్ పడగొట్టారు. కాగా టోర్నీలో ఇది కేకేఆర్‌కి ఎనిమిదో విజయం. ఆ జట్టు ఖాతాలో మొత్తం 16 పాయింట్లు ఉన్నాయి. దీంతో శ్రేయస్ టీమ్ దాదాపు ప్లేఆఫ్ రౌండ్‌లోకి కూడా ప్రవేశించింది మరోవైపు లక్నో భారీ తేడాతో ఓడిపోవడంతో నెట్ రన్ రేట్ కూడా దెబ్బతింది.
High-Fives in the @KKRiders camp 🙌
ఇవి కూడా చదవండిWith that they move to the 🔝 of the Points Table with 16 points 💜
Scorecard ▶️ https://t.co/CgxfC5H2pD#TATAIPL | #LSGvKKR pic.twitter.com/0dUMJLasNQ
— IndianPremierLeague (@IPL) May 5, 2024
ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా.
అంకుల్ రాయ్, మనీష్ పాండే, శ్రీకర్ భరత్, షెర్ఫనే రూథర్‌ఫోర్డ్, వైభవ్ అరోరా
KL రాహుల్ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్
అర్షిన్ కులకర్ణి, మణిమారన్ సిద్ధార్థ్, కృష్ణప్ప గౌతం, యుధ్వీర్ సింగ్, దేవదత్ పడిక్కల్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..