
Mumbai Indians, IPL 2024: ఐపీఎల్ 2024కి ముందు ముంబై ఇండియన్స్ జట్టులో పెద్ద మార్పు చోటు చేసుకుంది. ముంబై జట్టు లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ట్రేడ్ ద్వారా రొమారియో షెపర్డ్‌ని ముంబై జట్టులో జాయిన్ చేసుకుంది. వెస్టిండీస్ బౌలింగ్ ఆల్ రౌండర్ ఐపీఎల్‌లో ఇప్పటివరకు కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 2023 IPLలో అతను లక్నో సూపర్ జెయింట్స్ తరపున 1 మ్యాచ్ మాత్రమే ఆడాడు. అందులో అతను బ్యాటింగ్ చేసిన మొదటి బంతికే అవుట్ అయ్యాడు.
అంతకుముందు 2022లో షెపర్డ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో భాగంగా ఉన్నాడు. ఐపీఎల్‌లో అరంగేట్రం చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ తరపునే కావడం విశేషం. 2022 ఐపీఎల్‌లో వెస్టిండీస్ ఆల్ రౌండర్‌ను హైదరాబాద్ జట్టు రూ.7.75 కోట్లకు కొనుగోలు చేసింది. దీని తరువాత, IPL 16 అంటే 2023 టోర్నమెంట్ కోసం అతనికి రూ. 50 లక్షల ధర చెల్లించి లక్నో సూపర్ జెయింట్స్ అతనిని తమ జట్టులో భాగస్వామ్యాన్ని చేసింది. షెపర్డ్ ఇప్పటి వరకు మొత్తం 4 IPL మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను బ్యాటింగ్‌లో 58 పరుగులు, బౌలింగ్‌లో 3 వికెట్లు తీసుకున్నాడు.
అదే సమయంలో అన్ని జట్లు IPL 2024 వేలానికి ముందు ఆటగాళ్లను మార్పు చేసుకుంటున్నాయి. ఇది కాకుండా, వేలానికి ఒక నెల ముందు జట్లు రిటైన్ చేసిన, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేయాల్సి ఉంటుంది. నివేదికల ప్రకారం, ఐపీఎల్ జట్లు నవంబర్ 15 లోపు రిటైన్, విడుదల చేయాల్సిన ఆటగాళ్ల జాబితాను ఐపిఎల్ కమిటీకి సమర్పించాలి. 2024 టోర్నమెంట్ కోసం వేలం ఒక నెల తర్వాత నిర్వహించనున్నారు.
కాగా, IPL 2024 వేలం తేదీని డిసెంబర్ 19గా ఉంచినట్లు తెలుస్తోంది. వేలం ఈసారి దుబాయ్‌లో జరగవచ్చని అంటున్నారు. గతంలో 2023 ఐపీఎల్ వేలం కొచ్చిలో జరిగింది. ఈసారి జట్లు తమ అభిమాన ఆటగాళ్లను బహిరంగంగా వేలం వేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే జట్ల పర్స్ విలువ రూ.5 కోట్ల వరకు పెరుగుతుంది. అంటే గతంలో రూ.95 కోట్లుగా ఉన్న జట్ల పర్స్ విలువ ఈసారి రూ.100 కోట్లకు చేరనుంది. అలెక్స్ హేల్స్, సామ్ బిల్లింగ్స్, పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, క్రిస్ వోక్స్, గెరాల్డ్ కోయిట్జే వంటి విదేశీ ఆటగాళ్లు కూడా IPL 2024 వేలంలో పాల్గొనవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..