Lucknow Super Giants vs Royal Challengers Bangalore Highlights: IPL 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మంగళవారం రాత్రి ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ (LSG vs RCB)లో ఆ జట్టు18 పరుగుల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (96) , ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ (25/4) ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించారు. కాగా ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇది ఐదో విజయం. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది డుప్లెసిస్ సేన. అదే సమయంలో, ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో మూడో ఓటమిని మూటగట్టకున్న లక్నో సూపర్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. కెప్టెన్సీ ఇన్సింగ్స్‌తో ఆకట్టుకున్న డుప్లెసిస్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కింది.
నిరాశపర్చిన టాపార్డర్..
కాగా 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన లక్నోకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ డికాక్ (3), మనీశ్ పాండే (6) త్వరత్వరగా ఔటయ్యారు. కెప్టెన్ రాహుల్(30) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. అయితే కృనాల్ పాండ్యా (42) కొన్ని మెరుపులు మెరిపించాడు. దీపక్ హుడా (13), ఆయుష్ బదోని (13) నిరాశపరిచడంతో లక్నో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి పరాజయం వైపు సాగింది. చివర్లో స్టోయినిస్ (24), హోల్డర్ కొన్ని భారీ షాట్లు ఆడినా అవి ఓటమి వ్యత్యాసాన్ని తగ్గించాయి తప్ప జట్టుకు విజయాన్ని అందించలేకపోయాయి. RCB ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ 4 వికెట్లు పడగొట్టి లక్నోను కట్టడి చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆజట్టు 8 వికెట్లకు 163 పరుగులు మాత్రమే చేసి 18 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.
ప్లేయింగ్ ఎలెవెన్..
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్, డికాక్, మనీశ్ పాండే, స్టోయినిస్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని, జేసన్ హోల్డర్, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: డుప్లెసిస్, అనుజ్ రావత్, విరాట్ కోహ్లి, మ్యాక్స్‌వెల్, ప్రభుదేస్సాయ్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, హసరంగ, హర్షల్ పటేల్, హేజిల్‌వుడ్, సిరాజ్
లక్నో బ్యాటింగ్ విషయంలో పటిష్టంగా కనిపిస్తున్నా.. బౌలింగ్‌లో కాస్త ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తుంది. దుష్మంత చమీరా, జేసన్ హోల్డర్, కృనాల్ పాండ్యా ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు.
ఆర్సీబీ బ్యాటింగ్‌లో అనుజ్ రావత్, ప్రభుదేస్సాయ్, షాబాజ్ అహ్మద్ లాంటి యువకులు రాణిస్తుండగా, సీనియర్లు డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్ తమ పాత్రలకు న్యాయం చేస్తున్నారు. అయితే విరాట్ ఫామ్ కలవరపెడుతోంది.
లక్నో 20 ఓవర్లకి 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. దీంతో బెంగుళూరు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. బెంగుళూర్ బౌలర్లలో జోష్ హజిల్‌వుడ్ 4 వికెట్లు, హర్షల్ పటేల్ 2, మహ్మద్ సిరాజ్1, మాక్స్‌వెల్1 ఒక వికెట్ సాధించారు. లక్నోలో కృనాల్ పాండ్యా 42 పరుగులు, కెప్టెన్ కెఎల్ రాహుల్ 30 పరుగులు, మార్కస్ 24 పరుగులు మినహాయించి ఎవ్వరూ పెద్దగా ఆడలేదు.
లక్నో ఎనిమిదో వికెట్ కోల్పోయింది. జాసన్ హోల్డర్ 16 పరుగులకి ఔటయ్యాడు. హర్షద్ పటేల్ బౌలింగ్‌లో సిరాజ్ క్యాచ్ పట్టాడు. దీంతో లక్నో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.
లక్నో 18.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. క్రీజులో దుష్‌మంత్ చమీర 1 పరుగు, జాసన్ హోల్డర్ 3 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి 7 బంతుల్లో 32 పరుగులు చేయాలి. బెంగుళూర్ బౌలర్లలో జోష్ హజిల్‌వుడ్ 3 వికెట్లు, హర్షల్ పటేల్ 1, మహ్మద్ సిరాజ్1, మాక్స్‌వెల్1 ఒక వికెట్ సాధించారు.
లక్నో ఏడో వికెట్ కోల్పోయింది. మార్కస్ 24 పరుగులకి ఔటయ్యాడు. హజిల్‌వుడ్ బౌలింగ్‌లో బోల్డ్ అయ్యాడు. దీంతో లక్నో 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 10 బంతుల్లో 34 పరుగులు చేయాలి.
లక్నో ఆరో వికెట్ కోల్పోయింది. ఆయుష్ బదోని13 పరుగులకి ఔటయ్యాడు. హజిల్‌వుడ్ బౌలింగ్‌లో కార్తీక్ క్యాచ్ తీసుకున్నాడు. దీంతో లక్నో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 20 బంతుల్లో 47 పరుగులు చేయాల్సి ఉంది.
లక్నో 15 ఓవర్లకి 5 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. క్రీజులో ఆయుష్ బదోని 10 పరుగులు, మార్కస్ 5 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 30 బంతుల్లో 65 పరుగులు చేయాల్సి ఉంది.
లక్నో ఐదో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా 42 పరుగులకి ఔటయ్యాడు. మాక్స్‌వెల్ బౌలింగ్‌లో షాబాజ్ క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. దీంతో లక్నో 5 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 38 బంతుల్లో 74 పరుగులు చేయాల్సి ఉంది.
లక్నో నాలుగో వికెట్ కోల్పోయింది. దీపక్ హుడా 13 పరుగులకి ఔటయ్యాడు. సిరాజ్ బౌలింగ్‌లో ప్రభు క్యాచ్ తీసుకున్నాడు. దీంతో లక్నో 4 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 45 బంతుల్లో 82 పరుగులు చేయాల్సి ఉంది.
లక్నో 12.1 ఓవరల్లో 3 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. క్రీజులో కృనాల్ పాండ్యా 38 పరుగులు, దీపక్ హుడా13 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 46 బంతుల్లో పరుగులు 82 చేయాల్సి ఉంది. బెంగుళూర్ బౌలర్లలో జోష్ హజిల్‌వుడ్ 2 వికెట్లు, హర్షల్ పటేల్ ఒక వికెట్ సాధించాడు.
లక్నో 10 ఓవర్లకి 3 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. క్రీజులో కృనాల్‌పాండ్యా 31 పరుగులు, దీపక్ హుడా 5 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 60 బంతుల్లో 99 పరుగులు చేయాల్సి ఉంది.
లక్నో మూడో వికెట్ కోల్పోయింది. 30 పరుగులకి ఔటయ్యాడు. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో కార్తీక్ క్యాచ్ తీసుకోవడంతో వెనుదిరిగాడు. దీంతో లక్నో 3 వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 71 బంతుల్లో 117 పరుగులు చేయాల్సి ఉంది.
లక్నో 7 ఓవరల్లో 2 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. క్రీజులో కెఎల్ రాహుల్ 26 పరుగులు, కృనాల్ పాండ్యా 14 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 78 బంతుల్లో 132 పరుగులు చేయాల్సి ఉంది.
లక్నో టీం రెండో వికెట్ కోల్పోయింది. మనీశ్ పాండే 6 పరుగులకి ఔటయ్యాడు. హజల్‌వుడ్ బౌలింగ్‌లో హర్షల్ పటేల్ క్యాచ్ తీసుకున్నాడు. దీంతో లక్నో 2 వికెట్లు కోల్పోయి 33 పరుగులు చేసింది. విజయాలనికి ఇంకా 87 బంతుల్లో 146 పరుగులు చేయాల్సి ఉంది.
డికాక్(3) రూపంలో లక్నో టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. హజల్‌వుడ్ బౌలింగ్‌లో మాక్స్‌వెల్ అద్భుత క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. దీంతో 3 ఓవర్లకు లక్నో టీం ఒక వికెట్ కోల్పోయి 17 పరుగులు చేసింది.
బెంగళూర్ నిర్ణీత 20 ఓవర్లతో 6 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. దీంతో లక్నో ముందు 182 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. బెంగళూర్ టీంలో కెప్టెన్ డుప్లిసిస్ 96 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా, మాక్స్‌వెల్ 23, షాబాద్ అహ్మద్ 26, కార్తీక్ 13 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. మరోవైపు లక్నో బౌలర్లలో చమీరా 2, పాండ్యా 1, జాసన్ హోల్డర్ 2 వికెట్లు పడగొట్టారు.
సెంచరీకి కేవలం 4 పరుగుల దూరంలో బెంగళూర్ సారథి డుప్లిసిస్ (96 పరుగులు, 64 బంతులు, 11 ఫోర్లు, 2 సిక్సులు) పెవిలియన్ చేరాడు. దీంతో బెంగళూర్ నిర్ణీత 20 ఓవర్లతో 6 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది.
15.2 ఓవర్లకు షాబాజ్ అహ్మద్(26) రూపంలో బెంగళూర్ టీం 5వ వికెట్‌ను కోల్పోయింది. దీంతో బెంగళూర్ టీం 15.2 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది.
బెంగళూరు 100 పరుగుల మార్క్‌ను క్రాస్ చేసింది. డుప్లెసిస్ రాణించడంతో జట్టు స్కోరు పెరుగుతోంది. 12 ఓవర్లు ముగిసే సమయానికి బెంగళూరు నాలుగు వికెట్ల నష్టానికి 107 పరుగుల వద్ద కొనసాగుతోంది. క్రీజులో డుప్లెసిస్ (42), షాబాజ్ అహ్మద్ (21) పరుగుల వద్ద కొనసాగుతున్నారు.
బెంగళూరు స్కోర్ క్రమంగా పెరుగుతోంది. వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయిన జట్టును డుప్లెసిస్ ఆదుకునే పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే 28 బంతుల్లోనే 33 పరుగలు సాధించాడు. 11 ఓవర్లు ముగిసే సమయానికి 92 పరుగుల వద్ద కొనసాగుతోంది.
బెంగళూరు మరో వికెట్ కోల్పోయింది. వరుస బౌండరీలతో జట్టు స్కోరును పెంచుతున్నాడని అనుకుంటున్న సమయంలోనే మ్యాక్స్‌వెల్ (23) అవుట్ అయ్యాడు. కృనల్ పాండ్యా బౌలింగ్‌లో హోల్డర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆర్‌సీబీ 6 ఓవర్లు ముగిసే సమయానికి 47 పరుగుల వద్ద కొనసాగుతోంది.
బెంగళూరుకు వరుస షాక్‌లు ఎదురయ్యాయి. మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయింది. చమీర బౌలింగ్‌లో అంజూ రావత్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, క్రీజులోకి వచ్చిన కోహ్లి తొలి బంతికే దీపక్ హూడాకు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో బెంగళూరు ఒక్కసారిగా కష్టాల్లోకి కూరుకుపోయింది.
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్, డికాక్, మనీశ్ పాండే, స్టోయినిస్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని, జేసన్ హోల్డర్, దుష్మంత చమీరా, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: డుప్లెసిస్, అనుజ్ రావత్, విరాట్ కోహ్లి, మ్యాక్స్‌వెల్, ప్రభుదేస్సాయ్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, హసరంగ, హర్షల్ పటేల్, హేజిల్‌వుడ్, సిరాజ్
టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ తొలు బౌలింగ్ చేయడానికి మొగ్గు చూపింది. ఐపీఎల్ తాజా సీజన్‌లో అన్ని జట్లు అనుసరిస్తున్న విధానాన్నే లక్నో మళ్లీ ఫాలో అయ్యింది. టాస్ గెలిచిన వారంతా మొదట బౌలింగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో లక్నో కూడా ఛేజింగ్ చేయాలని ఫిక్స్ అయ్యింది. మరి లక్నో తీసుకున్న ఈ నిర్ణయం ఆ జట్టుకు ఏమేర ఉపయోగపడుతుందో చూడాలి.
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్, డికాక్, మనీశ్ పాండే, స్టోయినిస్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని, జేసన్ హోల్డర్, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: డుప్లెసిస్, అనుజ్ రావత్, విరాట్ కోహ్లి, మ్యాక్స్‌వెల్, ప్రభుదేస్సాయ్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, హసరంగ, హర్షల్ పటేల్, హేజిల్‌వుడ్, సిరాజ్