LSG, IPL 2022 Auction: 21 మంది ప్లేయర్లతో సిద్ధమైన కేఎల్ రాహుల్ సేన.. లక్నో పూర్తి జాబితా ఇదే..

|

Feb 14, 2022 | 6:30 AM

Lucknow Super Giants Auction Players: ఐపీఎల్ తదుపరి సీజన్ కోసం వేలం రెండు రోజుల పాటు కొనసాగింది. ఇందులో వందలాది మంది భారతీయ, విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.

LSG, IPL 2022 Auction: 21 మంది ప్లేయర్లతో సిద్ధమైన కేఎల్ రాహుల్ సేన.. లక్నో పూర్తి జాబితా ఇదే..
Lucknow Super Giants Auction Players
Follow us on

ఐపీఎల్ 2022 (IPL 2022) కోసం మెగా వేలం బెంగళూరులో నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగిన వేలంలో అన్ని జట్లు వందలాది మంది ఆటగాళ్లపై పందెం కాశాయి. ఈ ఈవెంట్‌లో, ఐపీఎల్‌లో తొలిసారిగా పాల్గొంటున్న లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) జట్టుపై అందరి దృష్టి పడింది. జట్టు ఆలోచనాత్మకంగా వారితో చాలా మంది యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లను చేర్చుకుంది. లక్నో జట్టులో ప్రస్తుతం 21 మంది ఆటగాళ్లు ఉన్నారు. రూ. 59 కోట్లతో లక్నో వేలంలోకి ప్రవేశించింది. తొలిరోజు ఫ్రాంచైజీ రూ.52.10 కోట్లు వెచ్చించగా, రెండో రోజు మిగిలిన డబ్బుతో ఆటగాళ్లపై జట్టు పందెం కాసింది. ఏయే ఆటగాళ్ల కోసం ఆ జట్టు ఎంత డబ్బు వెచ్చించిందో ఇప్పుడు చూద్దాం.

లక్నో సూపర్ జెయింట్స్ వేలంలో దక్కించుకున్న ఆటగాళ్లు..

మయాంక్ యాదవ్ – రూ. 20 లక్షలు

ఎవిన్ లూయిస్ – రూ. 2 కోట్లు

అవేష్ ఖాన్ – రూ. 10 కోట్లు

జాసన్ హోల్డర్ – రూ. 8.75 కోట్లు

కృనాల్ పాండ్యా – రూ. 8.25 కోట్లు

మార్క్ వుడ్ – రూ.7.50 కోట్లు

క్వింటన్ డి కాక్ – రూ. 6.75 కోట్లు

మనీష్ పాండే – రూ. 4.60 కోట్లు

దీపక్ హుడా – రూ. 5.75 కోట్లు

కరణ్ శర్మ – రూ. 20 లక్షలు

కైల్ మేయర్స్ – రూ. 50 లక్షలు

ఆయుష్ బడోని – రూ. 20 లక్షలు

మొహ్సిన్ ఖాన్ – రూ. 20 లక్షలు

మనన్ వోహ్రా – రూ. 20 లక్షలు

షాబాజ్ నదీమ్ – రూ. 50 లక్షలు

దుష్మంత చమేర – రూ. 2 కోట్లు

కృష్ణప్ప గౌతమ్ – రూ. 90 లక్షలు

అంకిత్ రాజ్‌పుత్ – రూ. 50 లక్షలు

 

లక్నో సూపర్ జెయింట్స్ రిటైన్ చేసిన ఆటగాళ్లు..

కేఎల్ రాహుల్ – రూ. 17 కోట్లు

మార్కస్ స్టోయినిస్ – రూ. 9.20 కోట్లు

రవి బిష్ణోయ్ – రూ. 4 కోట్లు

Also Read: Chama Milind IPL 2022 Auction: ఐపీఎల్‌ వేలంలో హైదరాబాద్ సీపీ కుమారుడు.. సొంతం చేసుకున్న కోహ్లీ టీం..

CSK, IPL 2022 Auction: 25 మంది ఆటగాళ్లతో చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధం.. ఎల్లో ఆర్మీలో ఎవరెవరున్నారంటే?