IPL 2025: ‘వీడు బౌలర్ల రోల్స్ రాయిస్.. క్రీజులో నిల్చోవాలంటే దడ పుట్టేస్తది’
Mayank Yadav: మయాంక్ యాదవ్ ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ తరపున అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టినా.. అంతకంటే ఎక్కువ వేగం, బౌలింగ్‌లో క్రమశిక్షణతో అందరి దృష్టిని ఆకర్షించాడు.
IPL 2025: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లలో రోల్స్ రాయిస్ పేరు కూడా ఉంది. డిజైన్‌తోపాటు ఫీచర్లు కూడా కారు ప్రపంచాన్ని శాసిస్తుంది. రోల్స్ రాయిస్ ప్రపంచంలోని అగ్రశ్రేణి కార్లలో ఒకటిగా పరిగణిస్తున్నారు. భారత ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ కూడా అదే దారిలో ఉన్నాడని టీమిండియా ప్రస్తుత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ అభిప్రాయపడ్డాడు. బ్యాట్స్‌మెన్‌ను భయపెట్టే పేస్ ఉన్న ప్రపంచంలోని మిగిలిన బౌలర్‌ల కంటే పూర్తిగా భిన్నమైనది. అంతేకాకుండా, అతను జట్టు గేమ్ ప్లాన్ ప్రకారం ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉన్నాడు. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, ఫీల్డింగ్‌లో ఫేమస్ అయిన జాంటీ రోడ్స్ తాజాగా వెల్లడించాడు.
జాంటీ రోడ్స్ ఏం చెప్పారు?
మయాంక్ యాదవ్ IPL 2024లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున అరంగేట్రం చేశాడు. అప్పుడు మోర్నే మోర్కెల్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా ఉండగా, జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ కోచ్ పాత్రలో ఉన్నాడు. మయాంక్ బౌలింగ్ చూసి మోర్కెల్ ఆశ్చర్యపోయానని రోడ్స్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. రోడ్స్ మాట్లాడుతూ, “వావ్, ఈ వ్యక్తి అద్భుతమైనవాడు. అతను బౌలర్ల రోల్స్ రాయిస్ లాంటివాడు. అదే విధంగా మేం అలాన్ డోనాల్డ్‌ను రోల్స్ రాయిస్ అని పిలిచేవాళ్ళం. అలాన్ డొనాల్డ్ దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ అని తెలిసిందే. అతను తన బౌలింగ్ యాక్షన్, పేస్, స్వింగ్‌కు ప్రసిద్ధి చెందాడు.
మయాంక్ యాదవ్ ఎక్కడ కనిపించలేదు?
మయాంక్ యాదవ్ వంటి బౌలర్లు ప్రపంచ క్రికెట్‌లో లెక్కిస్తుంటారు. ఐపీఎల్ చివరి సీజన్‌లో కేవలం 4 మ్యాచ్‌లు ఆడి సంచలనం సృష్టించాడు. అతని బౌలింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే గాయం కారణంగా అతను బయట కూర్చోవలసి వచ్చింది. అప్పటి నుంచి దాదాపు 4 నెలలు గడిచినా తిరిగి రాలేకపోయాడు. అతను ఏ మ్యాచ్ ఆడలేదు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, మయాంక్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో పునరావాసం పొందుతున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..