IPL 2023: ఐపీఎల్‌కి ముందే దుమ్మురేపిన బౌలర్.. 7 ఓవర్లలో 7 వికెట్లు.. అన్నీ మెయిడీన్లే.. జోష్‌లో కేకేఆర్ ఫ్యాన్స్..

Kolkata Knight Riders: ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకడిగా సునీల్ నరైన్ పేరు పొందాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో సునీల్ నరైన్ సభ్యుడు. IPL 2023లో కూడా ఈ బౌలర్ నుంచి షారుఖ్ ఖాన్ జట్టు గొప్ప ప్రదర్శనను ఆశిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

IPL 2023: ఐపీఎల్‌కి ముందే దుమ్మురేపిన బౌలర్.. 7 ఓవర్లలో 7 వికెట్లు.. అన్నీ  మెయిడీన్లే.. జోష్‌లో కేకేఆర్ ఫ్యాన్స్..
Kkr Ipl 2023

Updated on: Mar 21, 2023 | 6:58 AM

Sunil Narine: ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకడిగా సునీల్ నరైన్ పేరు పొందాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో సునీల్ నరైన్ సభ్యుడు. IPL 2023లో కూడా ఈ బౌలర్ నుంచి షారుఖ్ ఖాన్ జట్టు గొప్ప ప్రదర్శనను ఆశిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, IPL 2023 కంటే ముందు, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు శుభవార్త అందింది. టీమిండియా స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ మరోసారి అద్భుత బౌలింగ్‌ను ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో సునీల్ నరైన్ 7 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఈ 7 ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. అంటే అతను అన్ని మెయిడిన్ ఓవర్లు బౌల్ చేశాడన్నమాట. దీంతోపాటు సునీల్ నరైన్ 7 వికెట్లు పడగొట్టాడు.

విధ్వంసం సృష్టించిన సునీల్ నరైన్..

సునీల్ నరైన్ 7 ఓవర్లలో పరుగులేమీ ఇవ్వకుండా 7 వికెట్లు పడగొట్టాడు. నిజానికి వెస్టిండీస్‌లో స్థానిక టోర్నమెంట్ జరుగుతోంది. ఈ టోర్నీలో సునీల్ నరైన్ అద్భుత ప్రదర్శన చేశాడు. క్వీన్స్ పార్క్ క్రికెట్ క్లబ్ తరపున ఆడుతున్న సునీల్ నరైన్ క్లార్క్ రోడ్ యునైటెడ్‌పై విధ్వంసం సృష్టించాడు. సునీల్ నరైన్ అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థి జట్టు కేవలం 76 పరుగులకే ఆలౌటైంది. అయితే, సునీల్ నరేన్ నిరంతరం సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు.

సునీల్ నరైన్ కెరీర్..

ఈ మ్యాచ్‌లో సునీల్ నరైన్ అత్యధికంగా 7 వికెట్లు పడగొట్టాడు. ఇది కాకుండా షాన్ హాక్లెట్ 18 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అదే సమయంలో ప్రత్యర్థి జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ స్కోరు 21 పరుగులు మాత్రమే. సునీల్ నరైన్ ఐపీఎల్ కెరీర్ గురించి మాట్లాడితే, అతను ఇప్పటివరకు 148 మ్యాచ్‌లు ఆడాడు. ఈ 148 మ్యాచ్‌ల్లో 152 వికెట్లు తీశాడు. అలాగే ఈ బౌలర్ ఒక ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన ఘనతను 7 సార్లు చేశాడు. ఇది కాకుండా వెస్టిండీస్ కోసం అంతర్జాతీయ కెరీర్‌లో సునీల్ నరైన్ కూడా చాలా ప్రభావం చూపాడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో సునీల్ నరైన్ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..