Team India: హీరోయిన్లతో టీమిండియా క్రికెటర్ల ఎఫైర్.. ఆ దెబ్బతో లవ్ స్టోరీలకు ఎండ్ కార్డు.. లిస్టులో షాకింగ్ పేరు
Team India: క్రికెట్, బాలీవుడ్ అనుబంధం ఎప్పటికీ విడదీయనిదిగా ఉంటుంది. భారత క్రికెటర్లు, బాలీవుడ్ నటీమణుల మధ్య ఎఫైర్స్‌పై అనేక వార్తలు వస్తుంటాయి. చాలా మంది క్రికెటర్లు బాలీవుడ్ నుంచి తమ జీవిత భాగస్వాములను ఎంచుకున్న సంగతి తెలిసిందే. అయితే, కొంతమంది క్రికెటర్లు నటీమణులతో సంబంధం కలిగి ఉన్నట్లు కూడా వార్తలు వస్తుంటాయి. కానీ, వారు వివాహం చేసుకోలేకపోయారు. ప్రేమ పుకార్లతోనే వార్తల్లో నిలిచేవారు.

అనుష్క శర్మతో విరాట్ కోహ్లి, హర్భజన్ సింగ్‌తో గీతా బస్రాల జోడీల ప్రేమ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, బాలీవుడ్ హీరోయిన్‌లను ప్రేమించి పెళ్లి చేసుకోలేకపోయిన క్రికెటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
3. యువరాజ్ సింగ్ – కిమ్ శర్మ:
భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ పేరు బాలీవుడ్ సర్కిల్స్‌లో తరచుగా వినిపిస్తోంది. అతని పేరు చాలా మంది అందాల రాశులతో ముడిపడి ఉంది. మీడియా కథనాల ప్రకారం, యువరాజ్, కిమ్ శర్మ చాలా కాలం పాటు ఒకరికొకరు డేటింగ్ చేశారు. అయితే, ఈ విషయంపై వీరిద్దరూ ఏమీ మాట్లాడలేదు. అందరి ముందు అంగీకరించలేదు. అయితే, ఇప్పుడు ఇద్దరూ తమ జీవితాల్లో ముందుకు సాగారు. యువరాజ్ సింగ్ హాజెల్ కీచ్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
2. ఇషా షర్వాణి – జహీర్ ఖాన్ ఎఫైర్..
భారత క్రికెటర్లు జహీర్ ఖాన్, ఇషా షర్వాణి ఒకరితో ఒకరు సుమారు ఎనిమిదేళ్ల పాటు డేటింగ్ చేశారు. చాలా కాలం తర్వాత ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ తరువాత, 2017 లో జహీర్ ఖాన్ బాలీవుడ్ నటి సాగరిక ఘట్గేని వివాహం చేసుకున్నాడు. షారుఖ్ ఖాన్ చిత్రం చక్ దే ఇండియాతో సాగరిక బాలీవుడ్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.
1. రవిశాస్త్రి – అమృతా సింగ్‌ల వ్యవహారం..
రవిశాస్త్రి, అమృతా సింగ్‌ల ఎఫైర్ గురించిన వార్తలు ఒకప్పుడు హెడ్‌లైన్స్‌లో ఉండేవి. రవిశాస్త్రి, అమృతా సింగ్ తమ ఎఫైర్ గురించి అందరి ముందు చెప్పుకున్నారు. కానీ, ఈ సంబంధం నిలవలేదు. 1990లో రవిశాస్త్రి రీతూ సింగ్‌ను, అమృతా సింగ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. సైఫ్ అలీ ఖాన్ అమృత కంటే ఐదేళ్లు చిన్నవాడనే సంగతి తెలిసిందే. అయితే, తరువాత వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ కరీనాను వివాహం చేసుకున్నారు.
మరిన్న క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..