IPL History: తొలి ఓవర్ తొలి బంతికే వికెట్.. ఐపీఎల్‌లో డేంజరస్ బౌలర్లు.. లిస్ట్‌లో ఐదుగురు మనోళ్లే
IPL 2025: ఐపీఎల్ 2025 మెగా వేలానికి రంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్ లిస్ట్, రిలీజ్ ప్లేయర్ల లిస్ట్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే, ఐపీఎల్ హిస్టరీలో కొంతమంది ప్లేయర్లు తమదైన ముద్ర వేశారు. అలాంటి ప్లేయర్లు కొంతమంది భారత బౌలర్లు ఓ స్పెషల్ రికార్డ్‌లో చేరారు.

Indian Bowlers Picked Wicket 1st ball of IPL Match: ఐపీఎల్ పేరు వినగానే అభిమానులందరికీ ముందుగా వచ్చేది ఫోర్లు, సిక్స్‌ల వర్షం. అయితే, ఈ లీగ్‌లో ఇప్పటి వరకు చాలామంది బౌలర్లు ఇలాంటి షాక్‌లకు గురయ్యారు. వీళ్లపై బ్యాట్స్‌మెన్స్ భారీగా పరుగులు చేయడం కనిపించింది. అయితే, కొందరి బౌలర్లు మాత్రం తగ్గేదేలే అంటూ వికెట్ల వేటతో బ్యాటర్లకు కౌంటర్ ఇస్తున్నారు. వీళ్ల బౌలింగ్‌లో పరుగులు తీయడం చాలా కష్టం. ఇలాంటి లిస్ట్‌లో దిగ్గజ భారత బౌలర్ల పేర్లు కూడా ఉన్నాయి.
మ్యాచ్‌లో, ప్రతి జట్టు మొదటి బంతికే వికెట్ కోల్పోయినప్పుడు ఒత్తిడికి గురవుతుంది. తొలి వికెట్ పతనం తర్వాత మిగతా బ్యాట్స్‌మెన్‌లు నెమ్మదిగా ఆడుతుంటారు. ఐపీఎల్ మ్యాచ్‌లో తొలి బంతికే వికెట్ తీసిన ఐదుగురు భారతీయ బౌలర్లను ఇప్పుడు చూద్దాం..
5. ప్రవీణ్ కుమార్..
ప్రవీణ్ కుమార్ 2011లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో తొలి బంతికే వికెట్ తీసిన ఘనత సాధించాడు. టోర్నీ తొమ్మిదో మ్యాచ్‌లో, అతను CSK బ్యాటర్ శ్రీకాంత్ అనిరుధ్‌ను తన బలిపశువుగా చేశాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
4. ఇర్ఫాన్ పఠాన్..
ఈ జాబితాలో భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా చేరాడు. IPL 2009 34వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతికే ఎస్ బద్రీనాథ్‌ను పఠాన్ పెవిలియన్‌కు చేర్చాడు. అయితే, ఆ తర్వాత పఠాన్ మరో వికెట్ తీయలేకపోయాడు.
3. ఇషాంత్ శర్మ..
ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన IPL 2019 26వ మ్యాచ్‌లో రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ఈ అద్వితీయమైన ఫీట్‌ని ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో ఇషాంత్ కేకేఆర్ ఇన్నింగ్స్ తొలి బంతికే జో డెన్లీని బౌల్డ్ చేసి జట్టుకు తొలి విజయాన్ని అందించాడు.
2. లక్ష్మీపతి బాలాజీ..
అద్భుతమైన బౌలింగ్‌తో పాటు చిరునవ్వుతో అభిమానులు లక్ష్మీపతి బాలాజీని ఇష్టపడుతుంటారు. అతను తరచూ పాక్ బౌలర్లను చిత్తు చేసేవాడు. ఐపీఎల్‌లో కూడా లక్ష్మీపతి బాలాజీ తన బౌలింగ్‌లో సత్తా చాటాడు. IPL 2009 తొమ్మిదో మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. ఈ సమయంలో అతను DC ఇన్నింగ్స్ మొదటి ఓవర్ మొదటి బంతికి గౌతమ్ గంభీర్‌ను బౌల్డ్ చేశాడు.
1. మహ్మద్ షమీ..
మహ్మద్ షమీ తన ఐపీఎల్ కెరీర్‌లో మూడుసార్లు మ్యాచ్ తొలి బంతికే వికెట్ తీయడంలో సఫలమయ్యాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన IPL 2014 ఆరవ మ్యాచ్‌లో అతను ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్ తొలి బంతికే జాక్వెస్ కలిస్ వికెట్ పడగొట్టాడు షమీ. ఐపీఎల్ 2022 (వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్)లో షమీ రెండోసారి, 2023లో మూడోసారి (వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్) ఈ ఘనతను సాధించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..