దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1 ఆధిక్యంతో గెల్చుకుంది. గురువారం (డిసెంబర్ 21) జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్ 78 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ని 2-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ సారథ్యంలోని టీమిండియా ఈ సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించింది. భారత్ తరఫున దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్ గెలిచిన రెండో కెప్టెన్ గా కేఎల్ రాహుల్ నిలిచాడు. అతని కంటే ముందు విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధించాడు. 2018లో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా 5-1తో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఆ తర్వాత 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు 2023లో టీమ్ ఇండియా సిరీస్ కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. ఈ సిరీస్‌కు ముందు, 2022లో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ 0-3 తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. అప్పుడు కూడా కేఎల్ రాహులే కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే టీమ్ ఇండియా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. అయితే ఈ ఏడాది మాత్రం రాహుల్ సారథ్యంలోని టీమిండియా దక్షిణిఫ్రికాను సొంతగడ్డపైనే ఓడించింది.
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో బ్యాటింగ్ పరంగా పెద్దగా ఆకట్టుకోలేదు కేఎల్ రాహుల్. అయితే వికెట్ కీపర్‌గా మాత్రం అదరగొడుతున్నాడు. తాజాగా జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో సైతం రాహుల్ అద్భుతమైన మూడు క్యాచ్‌లను అందుకున్నాడు. దీంతో రాహుల్‌కు ఇంపాక్ట్ ఫీల్డర్ అవార్డు వరించింది. అయితే రాహుల్ ఇక్కడే తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఇదే మ్యాచ్‌లో అద్భుతమైన క్యాచ్ అందుకున్న కొత్త ప్లేయర్ సాయి సుదర్శన్‌కు తన మెడల్‌ను ఇచ్చేశాడు రాహుల్. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌లో సహచర క్రికెటర్లు, స్టాఫ్ ఇతరులు చప్పట్లు కొడుతూ రాహుల్‌ను అభినందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో సుదర్శన్ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో దక్షిణాఫ్రికా డాషింగ్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ ఇచ్చిన బంతిని గాల్లోకి డైవ్ చేస్తూ అద్భుతంగా అందుకున్నాడు. మ్యాచ్‌ను ఇదే మలుపు తిప్పింది. అందుకే తనకొచ్చిన ఇంపాక్ట్ మెడల్‌ను యువ క్రికెటర్‌కు ఇచ్చి మరింత ప్రోత్సహించాడు. సుదర్శన్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
India go on top with this great take by Sai Sudarshan 👌
Tune in to the 3rd #SAvIND ODI LIVE NOW | @StarSportsIndia #Cricket pic.twitter.com/115D7P6TS6
— ESPNcricinfo (@ESPNcricinfo) December 21, 2023
𝗗𝗿𝗲𝘀𝘀𝗶𝗻𝗴 𝗥𝗼𝗼𝗺 𝗕𝗧𝗦 | 𝗜𝗺𝗽𝗮𝗰𝘁 𝗙𝗶𝗲𝗹𝗱𝗲𝗿 𝗼𝗳 𝘁𝗵𝗲 𝗢𝗗𝗜 𝗦𝗲𝗿𝗶𝗲𝘀
A 2⃣-1⃣ ODI series win in South Africa 🏆👌
Any guesses on who won the Impact fielder of the series medal? 🏅😎
WATCH 🎥🔽 #TeamIndia | #SAvINDhttps://t.co/z92KREno0C
— BCCI (@BCCI) December 22, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..