AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KL Rahul Diet Plan : దోశలు తింటే ఇంత ఫిట్‌నెస్ వస్తుందా? కేఎల్ రాహుల్ డైట్ మామూలుగా లేదుగా

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్.. మైదానంలో ఎంత క్రమశిక్షణతో కనిపిస్తారో, ఆయన ఆహార నియమాలు కూడా అంతే స్ట్రిక్ట్‌గా, ప్లాన్ ప్రకారం ఉంటాయని తాజాగా వెల్లడైంది. సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌తో బిజీగా ఉన్న రాహుల్ ఇటీవల ఒక షోలో తన రోజువారీ డైట్ ప్లాన్‌ను పంచుకున్నారు.

KL Rahul Diet Plan : దోశలు తింటే ఇంత ఫిట్‌నెస్ వస్తుందా? కేఎల్ రాహుల్ డైట్ మామూలుగా లేదుగా
Kl Rahul (1)
Rakesh
|

Updated on: Nov 18, 2025 | 5:11 PM

Share

KL Rahul Diet Plan : టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్.. మైదానంలో ఎంత క్రమశిక్షణతో కనిపిస్తారో, ఆయన ఆహార నియమాలు కూడా అంతే స్ట్రిక్ట్‌గా, ప్లాన్ ప్రకారం ఉంటాయని తాజాగా వెల్లడైంది. సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌తో బిజీగా ఉన్న రాహుల్ ఇటీవల ఒక షోలో తన రోజువారీ డైట్ ప్లాన్‌ను పంచుకున్నారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఏం తింటాడు, ఏ ఆహారం ఎంత పరిమాణంలో తీసుకుంటాడు వంటి వివరాలు చెప్పారు. రాహుల్ ఎంత కచ్చితమైన బ్యాలెన్స్‌తో తింటారో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు.

రాహుల్ తన ఉదయాన్ని దాదాపు ప్రతిరోజూ ఒకే రకమైన ఆహారంతో ప్రారంభిస్తానని చెప్పారు. ఆయన బ్రేక్‌ఫాస్ట్ అంటే ముఖ్యంగా దోశ, ఎగ్ భుర్జీ. రాహుల్ ఇంట్లో ఉన్నట్లయితే, వారంలో దాదాపు 6 రోజులు దోశ తింటారట. ఆయన బ్రేక్‌ఫాస్ట్‌లో నిత్యం 4 గుడ్లు కచ్చితంగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు రెండూ లభించేలా చూసుకోవడానికి గుడ్లతో పాటు అరటిపండు, దానిమ్మ వంటి కొన్ని రకాల పండ్లు కూడా తింటాడు. దీని అర్థం ఏంటంటే రోజు ప్రారంభంలోనే రాహుల్ తన శరీరానికి అవసరమైన కంప్లీట్ ఎనర్జీని, పోషణను అందిస్తాడు.

కేఎల్ రాహుల్ డైట్‌లో అత్యంత ఆసక్తికరమైన భాగం ఆయన లంచ్ ప్లాన్. ఆయన ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే, మధ్యాహ్న భోజనానికి కచ్చితంగా ఇండియన్ ఫుడ్ మాత్రమే తింటానని స్పష్టం చేశారు. లంచ్‌లో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్ల బ్యాలెన్స్‌పై ఆయన చాలా శ్రద్ధ వహిస్తారు. సాధారణ రోజుల్లో 150 గ్రాముల రైస్, మ్యాచ్/ట్రైనింగ్ రోజుల్లో 200 గ్రాముల రైస్ తీసుకుంటారు. అన్నంతో పాటు 200–250 గ్రాముల ప్రొటీన్ తీసుకుంటాడు. ఇందులో ఎక్కువగా సీ-ఫుడ్ (చేపలు వంటివి) ఉంటుంది. అప్పుడప్పుడు మటన్ కూడా తీసుకుంటాడు. లంచ్‌లో 150–200 గ్రాముల ఆకుకూరలు, కూరగాయలు కచ్చితంగా ఉంటాయి. బీన్స్ ఫ్రై అయినా, మరేదైనా సరే, ఆకుపచ్చని కూరగాయలు ఆయన డైట్‌లో తప్పనిసరి.

రాహుల్ రాత్రి భోజనం దాదాపు మధ్యాహ్న భోజనం లాగే ఉంటుంది.. కాకపోతే తీసుకునే పరిమాణాన్ని తగ్గిస్తాడు. అంటే ప్రొటీన్, కొద్దిగా కార్బోహైడ్రేట్లు, కొన్ని కూరగాయలు తీసుకుంటాడు. రాత్రి పూట తక్కువగా, తేలికగా తినడానికి ఇష్టపడతాడు. దీనివల్ల శరీరం త్వరగా కోలుకోవడానికి, మరుసటి రోజు ట్రైనింగ్‌కు సిద్ధంగా ఉండటానికి వీలవుతుంది.

ఈ డైట్ ఎందుకు ప్రత్యేకం?

కేఎల్ రాహుల్ డైట్ ప్లాన్ చూస్తే ఆయన ఫిట్‌నెస్‌ను ఎంత సీరియస్‌గా తీసుకుంటారో అర్థమవుతుంది. ఆయన ఆహారంలో కచ్చితమైన మోతాదు, బ్యాలెన్సుడ్ న్యూట్రీషియన్, శరీర అవసరాలకు అనుగుణంగా ప్రతిరోజూ మార్పులు ఉన్నాయి. రాహుల్ ఈ స్ట్రిక్ట్ డైట్‌ను పాటిస్తున్నాడు కాబట్టే, మైదానంలో నిలకడగా రాణించగలుగుతున్నాడు. బహుశా ఇదే ఆయన సక్సెస్ సీక్రెట్ అయి ఉండొచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..