Kieron Pollard : 6,6,6,6,6,6…వయసుతో సంబంధం లేదు…బౌలర్లను ఊచకోత కోయడమే మనోడి పని
సీపీఎల్ 2025.. 23వ మ్యాచ్‌లో కిరోన్ పోలార్డ్ 54 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఇది అతనికి ఈ సీజన్‌లో మూడో హాఫ్ సెంచరీ. అమెజాన్ వారియర్స్తో జరిగిన ఈ మ్యాచ్‌లో అతను 5 సిక్సులు, 5 ఫోర్లు కొట్టాడు. పోలార్డ్ ఈ మెరుపు ఇన్నింగ్స్ సహాయంతో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మొదట బ్యాటింగ్ చేసి 167 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా జరిగింది.

Kieron Pollard : కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2025లో కీరన్ పొలార్డ్ తన దూకుడు కొనసాగిస్తున్నాడు. 23వ మ్యాచ్‌లో అమేజాన్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్ 54 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఇది ఈ సీజన్‌లో అతనికి మూడవ హాఫ్ సెంచరీ. కేవలం 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో పొలార్డ్ తన మెరుపు ఇన్నింగ్స్‌ను పూర్తి చేశాడు. పొలార్డ్ ఆడిన ఈ మెరుపు ఇన్నింగ్స్ సాయంతో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 167 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. చివరికి అమేజాన్ వారియర్స్ ఈ మ్యాచ్‌లో గెలిచింది.
పొలార్డ్ బ్యాటింగ్ తర్వాత మ్యాచ్‌లో ఏం జరిగింది?
అమేజాన్ వారియర్స్ జట్టు 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. అయితే, ఆ జట్టు తొలి ఓవర్‌లోనే మోయిన్ అలీ (4)ను కోల్పోయింది. ఆ తర్వాత మరో ఓపెనర్ కీమో పాల్ (6) కూడా తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత షాయ్ హోప్ (53), హెట్‌మైర్ (49) మధ్య అద్భుతమైన పార్టనర్ షిప్ ఆ జట్టును గెలిపించింది. ఆ తర్వాత సునీల్ నరైన్ వీరిద్దరినీ అవుట్ చేసి ట్రిన్‌బాగో జట్టుకు కొంత ఆశను కల్పించాడు. అయితే, డీవైన్ ప్రిటోరియస్ 14 బంతుల్లో 3 సిక్సర్లతో 26 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు.
సీపీఎల్ 2025లో పొలార్డ్‌కు మూడో హాఫ్ సెంచరీ
38 ఏళ్ల వయసులోనూ కీరన్ పొలార్డ్ ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇది ఈ సీజన్‌లో అతనికి మూడో హాఫ్ సెంచరీ. ఈ మ్యాచ్‌కు ముందు పొలార్డ్.. సెయింట్ లూసియా కింగ్స్ జట్టుపై రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. సీపీఎల్ 2025లో ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌లలో 185కి పైగా స్ట్రైక్ రేట్‌తో 291 పరుగులు చేశాడు. పొలార్డ్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 25 సిక్సర్లు, 20 ఫోర్లు కొట్టాడు.
పాయింట్స్ టేబుల్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్
ఈ సీజన్‌లో ట్రిన్‌బాగో జట్టుకు ఇది మూడవ ఓటమి. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌లలో 6 గెలిచి, పాయింట్స్ టేబుల్‌లో రెండవ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన గయానా అమేజాన్ వారియర్స్ జట్టుకు ఇది నాలుగవ విజయం. ఆ జట్టు ఆడిన 6 మ్యాచ్‌లలో 2 ఓడిపోయింది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో నాల్గవ స్థానంలో ఉంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో మొదటి స్థానంలో సెయింట్ లూసియా కింగ్స్ ఉంది. ఆ జట్టు ఆడిన 8 మ్యాచ్‌లలో 5 గెలిచి, కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




