Vijay Hazare Trophy: ఎట్టకేలకు ఫాంలోకొచ్చినా.. రిజల్ట్‌లో మాత్రం బ్యాడ్‌లక్కే.. శని పూజలు షురూ చేయాలంటోన్న నెటిజన్స్..

Vijay Hazare Trophy 2023: అద్భుతమైన బ్యాటింగ్‌ను ప్రదర్శించిన సహబ్ యువరాజ్ 136 బంతుల్లో 1 సిక్స్, 13 ఫోర్లతో అజేయంగా 121 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో రైల్వేస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. సంజూ శాంసన్‌ ఒంటరి పోరాటం చేసినా కేరళ జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించలేకపోయింది. చివరకు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసిన కేరళ జట్టు 18 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Vijay Hazare Trophy: ఎట్టకేలకు ఫాంలోకొచ్చినా.. రిజల్ట్‌లో మాత్రం బ్యాడ్‌లక్కే.. శని పూజలు షురూ చేయాలంటోన్న నెటిజన్స్..
Sanju Samson Century

Updated on: Dec 06, 2023 | 7:47 AM

Vijay Hazare Trophy 2023: బెంగళూరులోని కిని స్పోర్ట్స్ ఎరీనాలో జరుగుతున్న విజయ్ హజారే టోర్నమెంట్ రౌండ్ 7 మ్యాచ్‌లో కేరళ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson) ఎట్టకేలకు ఫాంలోకి వచ్చాడు. అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. రైల్వేస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో కేరళ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

రైల్వేస్ తరపున ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రథమ్ సింగ్ 77 బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 61 పరుగులు చేశాడు. మరోవైపు అద్భుత బ్యాటింగ్‌ను ప్రదర్శించిన సహబ్ యువరాజ్ 136 బంతుల్లో 1 సిక్స్, 13 ఫోర్లతో అజేయంగా 121 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో రైల్వేస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది.

ఇవి కూడా చదవండి

అనంతరం 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేరళ జట్టుకు శుభారంభం లభించలేదు. రోహన్ కున్నుమ్మల్ (0), సచిన్ బేబీ (9), సల్మాన్ నజీర్ (2) వికెట్లను కేవలం 26 పరుగులకే కోల్పోయింది. ఈ దశలో చేరిన సంజూ శాంసన్, శ్రేయాస్ గోపాల్ మంచి భాగస్వామ్యాన్ని అందించారు. శ్రేయస్ కూడా 63 బంతుల్లో 53 పరుగులు చేసి తన వికెట్‌ను కోల్పోయాడు.

అయితే, ఒంటరి పోరాటం కొనసాగించిన సంజూ శాంసన్ 139 బంతుల్లో 6 భారీ సిక్సర్లు, 8 ఫోర్లతో 128 పరుగులు చేశాడు. అలాగే, 50వ ఓవర్ 5వ బంతికి క్యాచ్ ఇచ్చి వికెట్ కోల్పోయాడు.

సంజూ శాంసన్ సెంచరీ..

సంజూ శాంసన్‌ ఒంటరి పోరాటం చేసినా కేరళ జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించలేకపోయింది. చివరకు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసిన కేరళ జట్టు 18 పరుగుల తేడాతో ఓడిపోయింది.

కేరళ ప్లేయింగ్ ఎలెవన్: రోహన్ కున్నుమ్మల్, సచిన్ బేబీ, సంజు శాంసన్ (కెప్టెన్), శ్రేయాస్ గోపాల్, సల్మాన్ నిజార్, కృష్ణ ప్రసాద్, అబ్దుల్ బాసిత్, బాసిల్ థంపి, అఖిన్ సత్తార్, వైశాఖ్ చంద్రన్, అఖిల్ స్కారియా.

రైల్వేస్ ప్లేయింగ్ ఎలెవన్: శివమ్ చౌదరి, వివేక్ సింగ్, ప్రథమ్ సింగ్, భార్గవ్ మెరాయ్, ఉపేంద్ర యాదవ్ (కెప్టెన్), సాహబ్ యువరాజ్, రాహుల్ శర్మ, కర్ణ్ శర్మ, అశుతోష్ శర్మ, రాజ్ చౌదరి, హిమాన్షు సాంగ్వాన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..