The Hundred : ఇక్కడ ఫెయిల్ అక్కడ పాస్.. ఎట్టకేలకు కప్పుకొట్టిన కావ్యమారన్ జట్టు.. ద హండ్రెడ్‌లో సూపర్‌చార్జర్స్ విక్టరీ
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఐపీఎల్‌లో టైటిల్ గెలవడంలో విఫలమై ఉండొచ్చు. కానీ ఆ జట్టు యజమాని కావ్య మారన్ సొంతమైన నార్తర్న్ సూపర్‌చార్జర్స్ జట్టు, ఇంగ్లండ్‌లో జరిగిన మహిళల ద హండ్రెడ్ లీగ్‌లో టైటిల్ గెలుచుకుంది. ఆగస్టు 31న ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సూపర్‌చార్జర్స్, సదరన్ బ్రేవ్ జట్టును 7 వికెట్ల తేడాతో ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది.

The Hundred : ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇటీవల ఐపీఎల్ ఫ్రాంఛైజీ టైటిల్ గెలవలేకపోయింది. కానీ, ఆ జట్టు యజమాని కావ్య మారన్ సొంతం చేసుకున్న కొత్త టీం మాత్రం టైటిల్ గెలిచింది. ఇంగ్లాండ్‌లో జరిగిన మహిళల ద హండ్రెడ్ లీగ్‌లో నార్తర్న్ సూపర్‌చార్జర్స్ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం, ఆగస్టు 31న జరిగిన ఫైనల్‌లో సూపర్ ఛార్జర్స్ సదరన్ బ్రేవ్ జట్టును 7 వికెట్ల తేడాతో సునాయాసంగా ఓడించింది. దీనితో సూపర్‌చార్జర్స్ మొదటిసారిగా ఈ టైటిల్‌ను గెలుచుకుంది. అంతేకాకుండా, రెండు సంవత్సరాల క్రితం ఫైనల్‌లో ఇదే సదరన్ బ్రేవ్ చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.
సదరన్ బ్రేవ్ దారుణ ప్రదర్శన
లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్‌లో సదరన్ బ్రేవ్ మొదట బ్యాటింగ్ చేసింది. లీగ్ దశలో అన్ని మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేసులో నిలిచిన బ్రేవ్, ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించింది. అందుకే ఈ జట్టు ఫైనల్‌కు ప్రధాన పోటీదారుగా నిలిచింది. కానీ, ఫైనల్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మెన్లు నిరాశపరిచారు. నార్తర్న్ సూపర్‌చార్జర్స్ బౌలర్ల దాటికి, సదరన్ బ్రేవ్ బ్యాట్స్‌మెన్లు ఎక్కువసేపు క్రీజ్‌లో నిలబడలేకపోయారు. చివరికి 100 బంతుల్లో 6 వికెట్లు కోల్పోయి కేవలం 115 పరుగులు మాత్రమే చేయగలిగారు.
సదరన్ బ్రేవ్ తరపున ఫ్రేయా క్యాంప్ 16 బంతుల్లో 26 పరుగులు, మ్యాడీ విలియర్స్ 11 బంతుల్లో 17 పరుగులు చేసి స్కోరును 100 దాటించారు. ఈ ఇద్దరు తప్ప మరెవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. సూపర్‌చార్జర్స్ తరపున కేట్ క్రాస్, అన్నాబెల్ సదర్లాండ్ చెరో 2 వికెట్లు తీశారు.
సదర్లాండ్ ఆల్ రౌండర్ ప్రదర్శన
బౌలింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన అన్నాబెల్ సదర్లాండ్, బ్యాటింగ్‌లో కూడా రాణించి సూపర్‌చార్జర్స్ జట్టును విజయం వైపు నడిపించింది. అయితే, జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. అంతకుముందు ఎలిమినేటర్ మ్యాచ్‌లో 42 బంతుల్లో సెంచరీ కొట్టిన 18 ఏళ్ల ఓపెనర్ డెవినా పెరిన్ కేవలం 17 పరుగులకే అవుట్ అయ్యింది. కానీ, ఆ తర్వాత వచ్చిన ఫోబె లిచ్‌ఫీల్డ్, సదర్లాండ్, నికోలా కేరీ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 88 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించారు. సదర్లాండ్ 88వ బంతికి సిక్సర్ కొట్టి తన జట్టుకు విజయాన్ని అందించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




