Surya Vs Samson: ‘మూడు గోల్డెన్ డక్‌లు.. అయినా సరే! శాంసన్‌తో సూర్యను పోల్చడం ఏంటి.?’

ఒకరితో మరొకరిని పోల్చడం సరికాదని.. మూడు గోల్డెన్ డక్‌లు అయితేనేం.. సంజూ శాంసన్‌తో సూర్యకుమార్ యాదవ్‌ను పోల్చకండంటూ..

Surya Vs Samson: మూడు గోల్డెన్ డక్‌లు.. అయినా సరే! శాంసన్‌తో సూర్యను పోల్చడం ఏంటి.?
Samson Vs Sky

Updated on: Mar 25, 2023 | 3:22 PM

ఒకరితో మరొకరిని పోల్చడం సరికాదని.. మూడు గోల్డెన్ డక్‌లు అయితేనేం.. సంజూ శాంసన్‌తో సూర్యకుమార్ యాదవ్‌ను పోల్చకండంటూ టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇలాంటి పోలికలు సరికాదని.. ఎవరైతే మెరుగైన ప్రదర్శనలు కనబరుస్తారో.. వారికి తప్పకుండా వరుస అవకాశాలు లభిస్తాయి. ఇక ఎవరికి అవకాశం ఇవ్వాలన్న విషయంలో తుది నిర్ణయం టీమ్ మేనేజ్‌మెంట్‌దే.

‘ఒకరికి మద్దతుగా నిలవాలని అనుకుంటే.. కచ్చితంగా టీమ్ మేనేజ్‌మెంట్ ఆ ప్లేయర్‌కు వరుస అవకాశాలు ఇస్తుంది. ట్రోల్స్ అనేవి ఎన్నైనా రావొచ్చు. కానీ జట్టు తుది ఎంపికలో ఫైనల్ డెసిషన్ మాత్రం యాజమాన్యానిదే అవుతుంది. అందుకే ఒక ప్లేయర్‌తో మరొకరికి అస్సలు పోలికలు పెట్టొద్దు’ అని టీమిండియా దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ తెలిపాడు.

కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. మూడు వన్డేలలోనూ మూడు గోల్డెన్ డక్‌లు నమోదు చేయడంతో అతడి ఎంపికపై తీవ్ర విమర్శలు తలెత్తాయి. శాంసన్‌ లాంటి ఆటగాడికి అవకాశాలు ఇవ్వకుండా స్కైకి చోటు ఇవ్వడంతో ఘోరంగా విఫలమవుతున్నాడని ఫ్యాన్స్ తిట్టిపోశారు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..