AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND VS ENG : ఇక్కడ భారత జట్టుకు చేదు అనుభవాలు ఎక్కువ.. ఈ సారైనా కథ మారుతుందా ?

లార్డ్స్ మైదానంలో టీమిండియా టెస్ట్ రికార్డు అంతగా ఆశాజనకంగా లేదు. 19 మ్యాచ్‌లలో 12 మ్యాచ్‌లలో ఓటమి చవిచూసింది.కేవలం 3 విజయాలు మాత్రమే సాధించింది. చివరగా 2014లో ఎంఎస్ ధోని కెప్టెన్సీలో గెలిచింది. తర్వాత టీమిండియా 2021లో ఇంగ్లాండ్‌ను ఘోరంగా ఓడించింది.

IND VS ENG : ఇక్కడ భారత జట్టుకు చేదు అనుభవాలు ఎక్కువ.. ఈ సారైనా కథ మారుతుందా ?
Team India
Rakesh
|

Updated on: Jul 09, 2025 | 7:02 PM

Share

IND VS ENG : భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మూడో మ్యాచ్ రేపు అంటే జూలై 10 నుంచి లండన్‌లోని చారిత్రాత్మక మైదానం లార్డ్స్‎లో జరగనుంది. భారత జట్టు ఈ మైదానంలో ఇప్పటివరకు మొత్తం 19 మ్యాచ్‌లు ఆడింది. లార్డ్స్ పిచ్‌పై భారత జట్టుకు రికార్డు అంతగా బాగోలేదు. భారత్ గెలిచిన మ్యాచ్‌ల కంటే డ్రా చేసుకున్న మ్యాచ్‌లే ఎక్కువగా ఉన్నాయి. ఈ చారిత్రాత్మక మైదానంలో భారత జట్టు అంతగా రాణించలేకపోయింది. భారత జట్టు రికార్డు చాలా పేలవంగా ఉంది. భారత్ ఈ మైదానంలో మొత్తం 19 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 12 మ్యాచ్‌లలో ఓటమి చవిచూసింది. కేవలం 3 మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించింది. ఇక 4 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఈ మూడు విజయాలలో రెండు, గత మూడు పర్యటనలలో సాధించినవే కావడం గమనార్హం.

భారత జట్టు మొదటగా 1986లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో ఈ మైదానంలో విజయం సాధించింది. ఆ తర్వాత రెండో విజయం సాధించడానికి భారత జట్టు ఏకంగా 28 సంవత్సరాలు ఎదురుచూడాల్సి వచ్చింది. టీమిండియా ఆ తర్వాత 2014లో ఎంఎస్ ధోని కెప్టెన్సీలో గెలిచింది. ఈ మైదానంలో మూడో, చివరి విజయం విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో లభించింది. టీమిండియా 2021లో ఇంగ్లాండ్‌ను ఘోరంగా ఓడించింది.

భారత్, ఇంగ్లాండ్ మధ్య ఇప్పటివరకు సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు జరిగాయి. మొదటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ భారత జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఇంగ్లాండ్ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో పుంజుకున్న భారత జట్టు, ఇంగ్లాండ్‌ను 336 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. భారత జట్టు ఇంగ్లాండ్ ముందు 608 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లాండ్ జట్టు ఈ లక్ష్యాన్ని ఛేదించలేక కేవలం 271 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో సిరీస్ 1-1తో సమంగా ఉంది. లార్డ్స్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ చేయండి..