Kane Williamson IPL 2023 Auction: హైదరాబాద్ వద్దంది.. గుజరాత్ రమ్మన్నది.. హార్దిక్ బ్యాకప్‌గా ‘కేన్ మామ’

Kane Williamson Auction Price: ఆక్షన్‌లో మొదటి పేరు కేన్‌ది కావడం.. ఏ ఫ్రాంచైజీ కూడా పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో.. పోటీ లేకుండానే గుజరాత్ టైటాన్స్ విలియమ్సన్‌(రూ. 2 కోట్లు)ను దక్కించుకుంది.

Kane Williamson IPL 2023 Auction: హైదరాబాద్ వద్దంది.. గుజరాత్ రమ్మన్నది.. హార్దిక్ బ్యాకప్‌గా 'కేన్ మామ'
Kane Williamson
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 23, 2022 | 3:17 PM

కేన్ విలియమ్సన్‌కు మినీ వేలంలో చుక్కెదురు అయింది. ఫామ్‌లేమితో సతమతమవుతున్న ఈ కివీస్ కెప్టెన్‌పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. ఎటువంటి పోటీ లేకుండానే డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ విలియమ్సన్‌(రూ. 2 కోట్లు)ను సొంతం చేసుకుంది. ఐపీఎల్‌లో కేన్ విలియమ్సన్‌కు అపారమైన అనుభవం ఉందని చెప్పొచ్చు. డేవిడ్ వార్నర్ హైదరాబాద్ కెప్టెన్‌గా తప్పుకున్న అనంతరం 14వ ఎడిషన్‌లో సన్‌రైజర్స్ సారధ్య బాధ్యతలు తీసుకున్న కేన్ మామ.. అటు బ్యాటర్‌గా.. ఇటు కెప్టెన్‌గా ఆ జట్టుకు ఎన్నో అద్భుత విజయాలను అందించాడు.

అయితే అనూహ్యంగా ఈ ఏడాది టోర్నమెంట్‌లో విలియమ్సన్ పెద్దగా రాణించలేకపోయాడు. అటు హైదరాబాద్ జట్టు కూడా టీంగా ఘోర వైఫల్యం చెందటంతో.. వేలానికి ముందుగా విలియమ్సన్‌ను ఆ ఫ్రాంచైజీ వదిలేసింది. అందరూ కూడా మినీ వేలంలో విలియమ్సన్ ఎక్కువ ధరకే అమ్ముడుపోతాడని భావించారు. ఆక్షన్‌లో మొదటి పేరు కేన్‌ది కావడం విశేషం. అయితే ఏ ఫ్రాంచైజీ కూడా అతడిపై పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో.. పోటీ లేకుండానే గుజరాత్ టైటాన్స్ విలియమ్సన్‌(రూ. 2 కోట్లు)ను గెలుచుకుంది.

కాగా, ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 76 మ్యాచ్‌లు ఆడిన విలియమ్సన్ 126 స్ట్రైక్ రేటుతో 2101 పరుగులు చేశాడు. ఇందులో 18 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2015 సీజన్‌లో సన్‌రైజర్స్ బెంగళూరు కేన్ విలియమ్సన్‌ను దక్కించుకోగా.. అదే జట్టుకు 2018లో టాప్ రన్‌గెట్టర్(735)గా నిలిచాడు. అలాగే వార్నర్‌తో కలిసి 2016-20 వరకు హైదరాబాద్‌కు టాప్ ఆర్డర్‌లో పరుగుల వరద పారించాడు.

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి