Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ ఛీ కొట్టింది.. కట్‌చేస్తే.. 35 బంతుల్లో విధ్వంసం సృష్టించిన కరేబియన్ ఖతర్నాక్ ప్లేయర్

Sharjah Warriors Victory Charles Blazing Innings: షార్జా వారియర్స్ అబుదాబి నైట్ రైడర్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచింది. జాన్సన్ చార్లెస్ 35 బంతుల్లో 65 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి విజయానికి కారణమయ్యాడు. నైట్ రైడర్స్ 161 పరుగులు చేసింది. ఐపీఎల్ వేలంలో ఎవరూ కొనకపోయినా, చార్లెస్ తన ప్రతిభను ఈ మ్యాచ్‌లో చూపించాడు. ఇది అతనికి మూడవ అర్ధశతకం.

ఐపీఎల్ ఛీ కొట్టింది.. కట్‌చేస్తే.. 35 బంతుల్లో విధ్వంసం సృష్టించిన కరేబియన్ ఖతర్నాక్ ప్లేయర్
Johnson Charles
Follow us
Venkata Chari

|

Updated on: Jan 31, 2025 | 4:07 PM

Johnson Charles 65 Run Blitz Sharjah Wins: కరేబియన్ బ్యాట్స్‌మెన్ జాన్సన్ చార్లెస్ 35 బంతుల్లో 65 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. షార్జా వారియర్స్ ఇంటర్నేషనల్ లీగ్ టీ20 25వ మ్యాచ్‌లో అబుదాబి నైట్ రైడర్స్‌పై 4 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. 9 మ్యాచ్‌ల్లో వారియర్స్‌కు ఇది నాలుగో విజయం కాగా, 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. కాగా, నైట్ రైడర్స్‌కి 8 మ్యాచ్‌ల్లో ఇది 5వ ఓటమి కాగా, ఆరు జట్ల ఈ టోర్నీలో 6 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది.

తొలుత బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ 8 వికెట్లకు 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. నైట్ రైడర్స్ తరపున కైల్ మేయర్స్ అత్యధికంగా 56 పరుగులు చేశాడు. వీరితో పాటు రోస్టన్ చేజ్ 21 బంతుల్లో 33 పరుగులు, జాసన్ హోల్డర్ 17 బంతుల్లో 26 పరుగులు చేశారు. వారియర్స్ ఆటగాడు ఆడమ్ జంపా 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి మూడు వికెట్లు తీయగా, ఆడమ్ మిల్నే 33 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వారియర్స్ 19 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఛేదించింది. చార్లెస్ 35 బంతుల్లో 65 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదాడు. అతనితో పాటు టామ్ కూల్హర్ కాడ్మోర్ 21 బంతుల్లో 39 పరుగులు చేశాడు. వీరిద్దరి మధ్య 66 పరుగుల భాగస్వామ్యం కూడా ఉంది.

ఐపీఎల్ వేలంలో మొండిచేయి..

ఈ లీగ్ సీజన్‌లో చార్లెస్‌కి ఇది మూడో అర్ధశతకం. వరుసగా రెండో హాఫ్ సెంచరీ బాదేశాడు. ఐపీఎల్ 2025 వేలంలో ఈ ఆటగాడిపై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. కాగా, ఈ లీగ్‌లో 9 మ్యాచ్‌లలో 291 పరుగులు చేశాడు. నిజానికి, IPL 2025 మెగా వేలంలో చార్లెస్‌కు కొనకపోవడం గమనార్హం. వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ చార్లెస్ రూ. 75 లక్షల బేస్ ధరతో వేలంలోకి ప్రవేశించాడు. అయితే ఏ ఫ్రాంచైజీ అతనిపై ఆసక్తి చూపలేదు. అతను అమ్ముడవ్వలేదు. అతను IPL 2023లో కోల్‌కతా నైట్ రైడర్స్‌లో భాగమయ్యాడు. లిటన్ దాస్ స్థానంలో అతడిని రూ. 50 లక్షలకు నైట్ రైడర్స్‌లో చేర్చారు. కానీ, అతనికి అరంగేట్రం చేసే అవకాశం రాలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..