AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకటి, రెండు కాదు.. ఏకంగా సచిన్ 3 రికార్డులపై కన్నేశాడుగా.. భారీ ప్రపంచ రికార్డ్ బద్దలే..!

Joe Root Sachin Tendulkar Records: టెస్టు క్రికెట్ చరిత్రలో తిరుగులేని బ్యాటర్‌గా కొనసాగుతున్న ఇంగ్లండ్ మాజీ సారథి జో రూట్ అరుదైన ఘనత దిశగా అడుగులు వేస్తున్నారు. పాకిస్తాన్‌తో లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో సాధించిన హాఫ్ సెంచరీతో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సరసన నిలవడమే కాకుండా, తదుపరి ఇన్నింగ్స్‌లో ఏకంగా మూడు రికార్డులను అధిగమించే సువర్ణావకాశాన్ని దక్కించుకున్నారు.

ఒకటి, రెండు కాదు.. ఏకంగా సచిన్ 3 రికార్డులపై కన్నేశాడుగా.. భారీ ప్రపంచ రికార్డ్ బద్దలే..!
Joe Root Sachin Tendulkar Records
Venkata Chari
|

Updated on: Aug 21, 2026 | 7:30 PM

Share

Joe Root Sachin Tendulkar Records: పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా హెడింగ్లే మైదానంలో ప్రారంభమైన తొలి టెస్టులో జో రూట్ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్, పాకిస్తాన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 171 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు బెన్ డకెట్, ఎమిలియో గే వికెట్లను త్వరగానే కోల్పోయి కాస్త తడబడింది. ఈ క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన రూట్, జోర్డాన్ కాక్స్‌తో కలిసి మూడో వికెట్‌కు ఏకంగా 150 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో రూట్ తన కెరీర్‌లో 68వ టెస్టు అర్ధ సెంచరీని పూర్తి చేసి, టెస్టు క్రికెట్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్ (68) పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును సమం చేశారు.

టెస్టుల్లో అత్యధిక అర్ధ సెంచరీల రికార్డు అధిగమించే అవకాశం..

సుదీర్ఘ ఫార్మాట్‌లో సచిన్ రికార్డులను బద్దలు కొట్టే దిశగా సాగుతున్న జో రూట్, టెస్టు చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవడానికి ఇంకా 1742 పరుగుల దూరంలో ఉన్నారు. అయితే తర్వాతి ఇన్నింగ్స్‌లోనే ఆయన సచిన్‌కు సంబంధించిన మూడు కీలక గణాంకాలను దాటేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

ఎక్కువమంది చదివినది:SL vs IND: లంకపై ఘన విజయం.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్ దూకుడు.. ఆ జట్టు ఔట్..?

ఇవి కూడా చదవండి

మొదటిది, టెస్టుల్లో అత్యధిక అర్ధ సెంచరీల రికార్డు. ప్రస్తుతం సచిన్, రూట్ ఇద్దరూ చెరో 68 హాఫ్ సెంచరీలతో సమఉజ్జీలుగా ఉన్నారు. రాబోయే ఇన్నింగ్స్‌లో రూట్ మరో అర్ధ శతకం నమోదు చేస్తే, సచిన్‌ను వెనక్కి నెట్టి టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్‌గా నయా చరిత్ర లిఖిస్తారు.

టెస్టుల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు:

సచిన్ టెండూల్కర్ (భారత్) – 68

జో రూట్ (ఇంగ్లండ్) – 68

పాకిస్తాన్‌పై సెంచరీల లెక్కల్లో ముందంజ..

పాకిస్తాన్‌పై టెస్టుల్లో 1000కి పైగా పరుగులు చేసిన బ్యాటర్లలో సచిన్, రూట్ ఇద్దరూ ఉన్నారు. సచిన్ 42.28 సగటుతో 1057 పరుగులు చేయగా, జో రూట్ 32 ఇన్నింగ్స్‌లలో 1553 పరుగులు సాధించారు. అయితే, పాక్‌పై టెస్టు సెంచరీల విషయంలో ఇద్దరూ సమానంగా చెరో 2 శతకాలు నమోదు చేశారు. ఈ జాబితాలో కుమార సంగక్కర 10 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఒకవేళ రూట్ తన తదుపరి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధిస్తే, పాకిస్తాన్‌పై టెస్టు శతకాల సంఖ్యలో సచిన్‌ను వెనక్కి నెట్టి ముందంజ వేస్తారు.

ఎక్కువమంది చదివినది: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 2027 వన్డే ప్రపంచకప్ జట్టులో వైభవ్‌కు చోటు.. ఓపెనర్లుగా ఎవరంటే?

స్వదేశంలో పాక్‌పై యాభైకి పైగా స్కోర్ల రికార్డు..

స్వదేశంలో పాకిస్తాన్‌పై అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక 50+ స్కోర్లు చేసిన రికార్డు కేన్ విలియమ్సన్ (4 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు) పేరిట ఉంది. భారత్ తరపున సునీల్ గవాస్కర్ తర్వాత స్వదేశంలో పాక్‌పై ఎక్కువ 50+ స్కోర్లు చేసిన రికార్డు సచిన్ పేరిట ఉంది.

ప్రస్తుతం స్వదేశంలో పాకిస్తాన్‌పై 50కి పైగా పరుగులు సాధించిన సందర్భాల్లో రూట్, సచిన్ సమానంగా ఉన్నారు. ఇద్దరూ సరిగ్గా 29 ఇన్నింగ్స్‌లలో 10 సార్లు యాభైకి పైగా స్కోర్లు (2 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు) నమోదు చేయడం విశేషం. రాబోయే ఇన్నింగ్స్‌లో రూట్ మరోసారి 50 మార్కును అందుకుంటే, స్వదేశంలో పాక్‌పై అత్యధిక 50+ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలోనూ సచిన్ టెండూల్కర్‌ను అధిగమిస్తారు.

ఎక్కువమంది చదివినది: ఏడాది పాటు నిషేధం.. కట్‌చేస్తే.. 11 ఫోర్లు, 11 సిక్సర్లు.. 72 బంతుల్లో రికార్డుల ఊచకోత..!

టెస్టు క్రికెట్‌లో నిలకడకు మారుపేరుగా నిలుస్తున్న జో రూట్ తన సూపర్ ఫామ్‌తో సరికొత్త రికార్డులను తిరగరాస్తున్నారు. పాకిస్తాన్‌తో జరిగే తదుపరి ఇన్నింగ్స్‌లో బ్యాట్ ఝుళిపిస్తే, దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఈ మూడు మైలురాళ్లు అధికారికంగా రూట్ ఖాతాలోకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us