భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా బ్రిస్బేన్‌లో అద్భుత ప్రదర్శనతో ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. వర్షం కారణంగా డ్రా గా ముగిసిన మూడో టెస్టులో 94 పరుగులకు తొమ్మిది వికెట్లు పడగొట్టిన బుమ్రాకు 14 రేటింగ్ పాయింట్లు లభించాయి. ఇప్పుడు 904 పాయింట్లతో తన కెరీర్‌లోనే అత్యధిక రేటింగ్ సాధించాడు. ఈ రేటింగ్‌తో బుమ్రా, 2016లో రవిచంద్రన్ అశ్విన్ నెలకొల్పిన రికార్డును సమం చేస్తూ ఐసీసీ చరిత్రలో అత్యధిక రేటింగ్ పొందిన భారత టెస్ట్ బౌలర్‌గా నిలిచాడు.
ఇక, మెల్‌బోర్న్‌లో జరగబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో బుమ్రాకు ఈ రికార్డును అధిగమించే అవకాశం ఉంది. మరోవైపు, సౌత్ ఆఫ్రికా ఆటగాడు కగిసో రబడా, ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హేజిల్‌వుడ్ బుమ్రా కంటే వెనుకబడి రెండు, మూడు ర్యాంకుల్లో నిలిచారు.
బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ తన అద్భుత ఫార్మ్‌ను కొనసాగిస్తూ నాలుగవ ర్యాంక్‌కు చేరాడు. అలాగే, భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ తన స్థానం పదిలం చేసుకుంటూ పది స్థానాలు ఎగబాకి 40వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ODI ఫార్మాట్‌లో పాకిస్థాన్ ఆటగాడు సైమ్ అయూబ్, హెన్రిచ్ క్లాసెన్ వారి సిరీస్ ప్రదర్శనలతో సెన్సేషన్‌గా నిలిచారు.
అఫ్ఘనిస్తాన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్జాయ్ వన్డే బౌలింగ్ తో పాటూ ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లోనూ గణనీయమైన మెరుగుదల సాధించాడు. టి20 ర్యాంకింగ్స్‌లో మహేదీ హసన్ టాప్ 10లో ప్రవేశించగా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఆటగాళ్లు తమ స్థానాలను మరింత మెరుగుపరుచుకున్నారు.
India's pace spearhead equals a massive feat after his incredible performance in the third #AUSvIND Test 👏
More on the latest ICC Men's Rankings ⬇https://t.co/akPvStkguX
— ICC (@ICC) December 25, 2024