AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూటర్న్ తీసుకున్న ఇండియన్ ఓపెనర్! కెప్టెన్సీ వదులుకొని మరి ఇక్కడే అడ్డుతా అంటూ MCA ని వేడుకున్న ముంబై స్టార్!

యశస్వి జైస్వాల్ గోవా తరఫున ఆడాలనే నిర్ణయాన్ని మార్చుకుని మళ్లీ ముంబైకి తిరిగొచ్చాడు. కెప్టెన్సీ ఆఫర్ వచ్చినా, కుటుంబ కారణాల వల్ల MCAకి NOC ఉపసంహరణకు అభ్యర్థించాడు. భారత జట్టులో స్థిరంగా నిలవడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశాడు. ఈ నిర్ణయం అతని దేశవాళీ ప్రస్థానంలో మరో కీలక మలుపు అయ్యింది.

యూటర్న్ తీసుకున్న ఇండియన్ ఓపెనర్! కెప్టెన్సీ వదులుకొని మరి ఇక్కడే అడ్డుతా అంటూ MCA ని వేడుకున్న ముంబై స్టార్!
Jaiswal U Turn!
Narsimha
|

Updated on: May 10, 2025 | 6:30 AM

Share

యశస్వి జైస్వాల్ తన దేశీయ క్రికెట్ భవిష్యత్తు గురించి తీసుకున్న తాజా నిర్ణయం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు దారి తీసింది. ఇటీవల గోవా తరఫున ఆడేందుకు మొగ్గుచూపిన 23 ఏళ్ల ఈ ప్రతిభావంతుడైన యువ ఆటగాడు, ఇప్పుడు మళ్లీ ముంబైకి మళ్లాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) నుంచి గోవాకు మారేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) కోరిన జైస్వాల్, తాజాగా తన ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. గోవా నుంచి కెప్టెన్సీ ఆఫర్ వచ్చినప్పటికీ, తన కుటుంబ ప్రణాళికల్లో మార్పు కారణంగా ముంబై తరఫున ఆడటం కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. MCAకి పంపిన ఇమెయిల్‌లో “గోవాకు మారాలనే నా ప్రణాళికలు నిలిచిపోయినందున నాకు ఇచ్చిన NOCని ఉపసంహరించుకోవాలనుకుంటున్నాను. ఈ సీజన్‌లో ముంబై తరఫున ఆడటానికి నన్ను అనుమతించండి” అని పేర్కొన్నాడు. బీసీసీఐ లేదా గోవా క్రికెట్ అసోసియేషన్‌కు తాను ఎలాంటి అధికారిక పత్రాలు సమర్పించలేదని కూడా స్పష్టం చేశాడు.

తన టెస్ట్ కెరీర్‌ను అత్యంత శుభంగా ప్రారంభించిన యశస్వి, గోవా తరఫున నాయకత్వ భాద్యతలు తీసుకోవాలనే ఆలోచనలో ఉండటం వాస్తవమే కానీ, అతని ప్రధాన దృష్టి భారత జాతీయ జట్టులో స్థిరంగా నిలవడంపైనే ఉంది. దేశవాళీ టోర్నీల్లో గోవా జట్టును ముందుకు నడిపించాలన్న ఆలోచన అతనిలో ఉన్నా, కుటుంబ పరిస్థితుల కారణంగా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నాడు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భదోహి జిల్లా సూర్యవాన్ గ్రామానికి చెందిన యశస్వి, తన చిన్ననాటి క్రికెట్ కలలను సాకారం చేసుకోవడానికి కేవలం 11 ఏళ్ల వయసులో ముంబైకి తరలివచ్చాడు. ఆతరువాత విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీ కొట్టి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. ఈ ప్రదర్శన అతనికి IPLలో రాజస్థాన్ రాయల్స్‌ ఒప్పందాన్ని, అనంతరం భారత జాతీయ జట్టులో చోటును తెచ్చిపెట్టింది.

ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్‌లో యశస్వి 19 మ్యాచ్‌లు ఆడి 52.88 సగటుతో 1,798 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు, పది అర్ధసెంచరీలు ఉన్నాయి. టాలెంట్‌తో పాటు స్థిరతను కూడబెట్టిన యశస్వి, దేశవాళీ క్రికెట్‌లో ముంబై తరఫున కొనసాగాలని నిర్ణయించడం అతని క్రికెట్ ప్రస్థానంలో మరో కీలక మలుపుగా చెప్పవచ్చు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ