Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8 నెలల తర్వాత తొలి టీ20.. 14 పరుగులకే 4 వికెట్లు.. హార్దిక్ పాండ్యా స్నేహితుడి ఫైర్ మాములుగా లేదుగా..

లాకీ ఫెర్గూసన్ మెరుపుదాడితో బ్యటర్లకు చుక్కలు చూపించాడు. తన కోటాలో 3.2 ఓవర్లలో నలుగురు బ్యాటర్లను చిత్తు చేసి, కివీస్ విజయానికి బటలు వేశాడు.

8 నెలల తర్వాత తొలి టీ20.. 14 పరుగులకే 4 వికెట్లు.. హార్దిక్ పాండ్యా స్నేహితుడి ఫైర్ మాములుగా లేదుగా..
Lockie Ferguson New Zealand Cricket Team
Follow us
Venkata Chari

|

Updated on: Jul 19, 2022 | 8:10 PM

ఆటగాడి నైపుణ్యం మాత్రమే మాట్లాడుతుంది. అలాంటప్పుడు అతను ఎంత కాలం తర్వాత ఏ ఫార్మాట్‌లో ఆడతాడన్నది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసంర లేదంటారు. హార్దిక్ పాండ్యా స్నేహితుడి విషయంలోనూ అదే జరిగింది. అతను 8 నెలల తర్వాత T20I లలో పునరాగమనం చేశాడు. అతను ఈ ఫార్మాట్ నుంచి ఎన్నడూ దూరంగా లేనట్లుగా మొదటి మ్యాచ్‌లోనే విధ్వంసం సృష్టించాడు. అతని బంతులు నిప్పులు చిమ్ముతూ కనిపించాయి. ఆ వేడిలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లు ఒకరి తర్వాత ఒకరు తట్టుకోలేక వికెట్లు కోల్పోయారు. తన కోటాలో 3.2 ఓవర్లలో ప్రత్యర్థి జట్టును గడగడలాడించాడు. ఆయనెవరని అనుకుంటున్నారా.. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ గురించి మాట్లాడుతున్నాం. అతను ఐర్లాండ్‌తో జరిగిన మొదటి T20లో తుఫాన్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.

న్యూజిలాండ్‌కు చెందిన లాకీ ఫెర్గూసన్ బౌలర్ అయితే, హార్దిక్ పాండ్యాతో స్నేహం ఏమిటి అని ఆలోచిస్తున్నారా.. అక్కడికే వస్తున్నాం.. ఐపీఎల్ కారణంగానే వీరి మధ్య స్నేహం ఏర్పడింది. హార్దిక్, ఫెర్గూసన్ ఇద్దరూ IPL 2022లో కలిసి ఆడారు. ఇద్దరూ కలిసి వీరు గుజరాత్‌ను ఛాంపియన్‌గా నిలిపారు.

ఇవి కూడా చదవండి

8 నెలల తర్వాత తిరిగి ఎంట్రీ ఇచ్చిన, లాకీ ఫెర్గూసన్ ఐర్లాండ్‌పై సత్తా చాటాడు. గతేడాది నవంబర్‌లో భారత్‌తో తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. కానీ, ఐర్లాండ్‌పై అతని కిల్లర్ బౌలింగ్ చూస్తుంటే, అతను ఇంత కాలం T20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నట్లు అనిపించలేదు.

ఈ మ్యాచ్‌లో లాకీ ఫెర్గూసన్ 3.2 ఓవర్లు బౌలింగ్ చేసి 14 పరుగులిచ్చి 4 బ్యాట్స్‌మెన్ వికెట్లు పడగొట్టాడు. ఇది T20I లలో అతని అత్యుత్తమ ప్రదర్శన కాకపోవచ్చు. కానీ, అది కూడా చాలా దూరంలో లేదు. పునరాగమనం చేస్తున్నప్పుడు అద్భుతంగా బౌలింగ్ చేయడం, జట్టు విజయానికి ఉపయోగపడేలా చేయడం చాలా పెద్ద విషయం అనే చెప్పుకోవాలి.

న్యూజిలాండ్ విజయం..

టీ20 సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. ఐర్లాండ్ ముందు 174 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రత్యుత్తరంలో, లాకీ ఫెర్గూసన్ అద్భుత బౌలింగ్ కారణంగా ఐర్లాండ్ జట్టు ఆ లక్ష్యానికి 31 పరుగుల దూరంలో ఉంది. ఈ విధంగా సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లగలిగింది.