సూపర్‌కింగ్స్ ఖాతాలో రెండో విజయం

| Edited By:

Mar 27, 2019 | 7:09 AM

ఐపీఎల్‌ 12వ సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ దూసుకుపోతోంది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని జట్టు 6వికెట్ల తేడాతో గెలిచింది. 147పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్‌కింగ్స్ బ్యాట్స్‌మన్‌లు.. దానిని ఛేదించేందుకు బాగానే కష్టపడ్డారు. ఓపెనర్ రాయుడు త్వరగానే ఔటైనా.. వాట్సన్, రైనా విరుచుకుపడటంతో చెన్నై లక్ష్యం దిశగా సాగింది. అయితే ఆ తరువాత రైనా ఔట్ అవ్వడంతో పరిస్థితి మారింది. ధోని, జాదవ్‌లు ధాటిగా ఆడలేకపోవడంతో స్కోరు వేగం బాగా తగ్గింది. ఇక చివరి […]

సూపర్‌కింగ్స్ ఖాతాలో రెండో విజయం
Follow us on

ఐపీఎల్‌ 12వ సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ దూసుకుపోతోంది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని జట్టు 6వికెట్ల తేడాతో గెలిచింది. 147పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్‌కింగ్స్ బ్యాట్స్‌మన్‌లు.. దానిని ఛేదించేందుకు బాగానే కష్టపడ్డారు. ఓపెనర్ రాయుడు త్వరగానే ఔటైనా.. వాట్సన్, రైనా విరుచుకుపడటంతో చెన్నై లక్ష్యం దిశగా సాగింది. అయితే ఆ తరువాత రైనా ఔట్ అవ్వడంతో పరిస్థితి మారింది. ధోని, జాదవ్‌లు ధాటిగా ఆడలేకపోవడంతో స్కోరు వేగం బాగా తగ్గింది. ఇక చివరి ఓవర్లో చేయాల్సింది రెండు పరుగులే అయినా.. రబాడ వాటిని అంత తేలిగ్గా ఇవ్వలేదు. తొలి బంతికి జాదవ్‌ను ఔట్ అవ్వగా.. తరువాత రెండు బంతులకు రబాడా పరుగే ఇవ్వకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. తరువాత ఐదో బంతికి బ్రావో కొట్టిన ఫోర్‌తో మ్యాచ్ ముగిసింది.

అయితే అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ను చెన్నై కట్టడి చేసింది. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఢిల్లీ బ్యాట్స్‌మన్స్ ఎక్కువ పరుగులు చేయలేకపోయారు . ఆరో ఓవర్లో షాను కోల్పోయిన దిల్లీ.. పది ఓవర్లు ముగిసే సరికి 65 పరుగులు మాత్రమే చేసింది. షా స్థానంలో వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ కూడా ధాటిగా ఆడలేకపోయాడు. అతడి తర్వాత వచ్చిన పంత్‌ తనదైన శైలిలో రెచ్చిపోవడంతో ఇన్నింగ్స్‌కు ఊపొచ్చింది. కానీ బ్రావో అతడి ఆటకు అడ్డుకట్టవేశారు. తర్వాత ఇంకెవరూ బ్యాట్ ఝుళిపించలేకపోవడంతో స్కోర్ 147వద్ద నిలిచింది.